Kasam Venkateshwarlu: ప్రముఖ వర్సిటీకి చెందిన ఓ అర్బన్ నక్సలైట్ ను బొక్కలో వేస్తామని, రేపో మాపో అదే జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు(Kasam Venkateswarlu) హెచ్చరించారు. ఆ అర్బన్ నక్సలైట్ కూడా గతంలో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు విద్య అనే అమ్మాయితో సీఎం(CM) ప్రేమలో పడ్డారని కబుర్లు చెబుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ విద్యను రేవంత్ సర్వ నాశనం చేశారని కాసం విమర్శించారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు డబ్బులు లేవని వీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ లెక్చరర్లతో యూనివర్సిటీలు నడపలేమని వీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ చేతగాని తనానికి నిదర్శనమని విమర్శించారు.
Also Read: Viral Video: ఫ్యాంటు జేబులో పేలిన మోటరోలా ఫోన్.. వీడియో వైరల్
న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై నిర్లక్ష్యం
2816 శాంక్షన్ పోస్టులుంటే కేవలం 797 పోస్టులతో యూనివర్సిటీలు నడుపుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో 11 యూనివర్సిటీలుంటే 6 యూనివర్సిటీలకు జీరో ప్రొఫెసర్స్ అని పేర్కొన్నారు. ఫ్యాకల్టీ లేకుండా రీసెర్చ్ ఎలా సాధ్యమని కాసం ప్రశ్నించారు. ప్రొఫెసర్స్ లేకుంటే యూజీసీ గ్రాంట్స్, కేంద్ర ప్రభుత్వ నిధులు ఎలా వస్తాయని నిలదీశారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై నిర్లక్ష్యం ఎందుకని కాసం ప్రశ్నించు. కొత్త విద్య విధానం అమలు చేయకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు ఇచ్చి నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వేసిన కేశవరావు, శ్రీధర్ బాబు కమిటీలు ఏం చేశాయని, రిపోర్ట్స్ ఏం చెప్పాయని నిలదీశారు. తెలంగాణ విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి విద్యావ్యవస్థలో ఏం మార్పు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కోదండరాం మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నల కాసం ప్రశ్నల వర్షం కురిపించారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చేరాలని, వీసీలు లేవనెత్తిన అన్ని అంశాలను ఫిల్ చేయాలని కాసం డిమాండ్ చేశారు.
Also Read: Viral Video: ఫ్యాంటు జేబులో పేలిన మోటరోలా ఫోన్.. వీడియో వైరల్

