Om Shanti Shanti Shantihi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). దర్శకత్వంతోనే కాకుండా, నటనలోనూ తనదైన ముద్ర వేస్తున్న ఆయన, ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi). ఈ చిత్రంలో అందాల నటి ఈషా రెబ్బా (Esha Rebba) హీరోయిన్‌గా నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాతో A R సజీవ్ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ మ్యూజికల్ జర్నీని గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాలోని మొదటి పాట ‘సిన్నారి కోన’ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టంట్ హిట్‌గా నిలిచింది.
Also Read- Anil Ravipudi: ఆ రోజు ఆ ఈవెంట్ లేకపోతే.. నేను డైరెక్షన్ వైపు వెళ్లే వాడినే కాదు..
బ్యూటీఫుల్ మెలోడీ
పెళ్లి తర్వాత జరిగే ‘అప్పగింతల’ నేపథ్యంలో సాగే ఈ పాటను సంగీత దర్శకుడు జయ కృష్ణ ఎంతో హృద్యంగా, బ్యూటీఫుల్ మెలోడీగా స్వరపరిచారు. ఈ పాటలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంట చూడముచ్చటగా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. నిజ జీవితంలో కూడా వాళ్లిద్దరూ ఒక్కటవుతున్నారనేలా ఈ మధ్య వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందే, వీరిద్దరూ ఇలా సినిమాలో పెళ్లి చేసుకుని, ముందుగానే రిహార్సల్స్ చేసినట్లుగా ఈ పాట ఉంది. ఈ పాటకు జయ కృష్ణతో పాటు అనన్య భట్, ఎం.జి. నరసింహ అందించిన గాత్రం ప్రాణం పోసింది. పాటలోని భావాన్ని ప్రేక్షకుల మనసులకు తాకేలా చేయడంలో వారు సఫలమయ్యారు. ఇక భరద్వాజ్ గాలి రాసిన సాహిత్యం పల్లెటూరి వాతావరణాన్ని, భావోద్వేగాలను కళ్ళకు కట్టినట్లు చూపించింది.
Also Read- Beauty OTT: ‘బ్యూటీ’ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?
కొత్త జంట కెమిస్ట్రీ హైలైట్
ఈ సాంగ్ వీడియోలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్తగా పెళ్లైన జంటగా వారిద్దరి నటన చాలా సహజంగా ఉంది. ముఖ్యంగా నవ వధువుగా ఈషా రెబ్బా, తన పుట్టింటిని వదిలి కొత్త ఇంటికి అలవాటు పడే క్రమంలో చూపించిన హావభావాలు, ఆ నాజూకుతనం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. తరుణ్ భాస్కర్ తనదైన ఈజ్‌తో పెళ్ళికొడుకు పాత్రలో ఒదిగిపోయారు. ఈ చిత్రం కేవలం డ్రామా మాత్రమే కాదు, అద్భుతమైన విలేజ్ కామెడీతో సాగనుంది. ఇందులో నవ్వుల రారాజు బ్రహ్మానందం, బ్రహ్మాజీ, గోపరాజు విజయ్, అమృతం అప్పాజీ వంటి దిగ్గజ నటులు ఉండటం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు ఫస్ట్ సింగిల్ సినిమాపై బజ్‌ను మరింత పెంచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో రూపొందిన ఈ చిత్రం జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సంక్రాంతి సందడి ముగిసిన వెంటనే, ఈ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

