Karimnagar News: కరీంనగర్ యువకుడి వినూత్న నిరసన.. కారణం?
TTD-Temple (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Karimnagar News: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్ యువకుడి వినూత్న నిరసన.. డిమాండ్ ఏంటంటే?

Karimnagar News: కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మించాలని డిమాండ్

యువకుడి వినూత్న నిరసన

కరీంనగర్, స్వేచ్ఛ: కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టాలంటూ ఓ యువకుడు వినూత్న నిరసనకు (Karimnagar News) దిగాడు. మంగళవారం పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్‌లో ఓ ఆసక్తికరమైన, ఆలోచింపజేసే ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్‌కు చెందిన కోట శ్యామ్ కుమార్ ఈ నిరసన చేపట్టాడు. కరీంనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మిస్తామంటూ గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ, అది అటకెక్కిందని విమర్శించాడు. గత ప్రభుత్వంలో కరీంనగర్ ప్రజల దైవభక్తిని, ఆధ్యాత్మికత అవసరాలను దృష్టిలో ఉంచుకొని అప్పటి మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ అధికారుల సమక్షంలో ఆలయ నిర్మాణానికి అత్యంత వైభవంగా భూమి పూజ కూడా నిర్వహించారని ప్రస్తావించాడు.

Read Also- New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరొద్దు.. ఖమ్మం పోలీస్ కమిషనర్ వార్నింగ్

కాగా, కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమం జరిగి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కేవలం భూమి పూజ చేసిన శిలాఫలకం మాత్రమే అక్కడ దర్శనమిస్తుండడంపై స్థానికుల్లో అసహనం వ్యక్తం అవుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ ఉత్తర ద్వారా దర్శనం కోసం ఆలయాలకు వెళ్లగా, శ్యామ్ కుమార్ మాత్రం నిర్మాణం ఆగిపోయిన టీటీడీ ఆలయ స్థలం వద్దకు చేరుకొని తన ఆవేదనను వెలిబుచ్చాడు. కోట్లాది రూపాయలతో అద్భుతమైన శిల్పకలతో ఆలయాన్ని నిర్మిస్తామని అప్పుడు చెప్పి, ఇప్పుడు ఆ ప్రాజెక్టును గాలికి వదిలేయడంపై మండిపడ్డారు.

అధికారులు, పాలకులు మారినా భక్తుల కల మాత్రం నెరవేరడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ… టీటీడీ ఆలయం వస్తే కరీంనగర్ జిల్లా మరో ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని, ఇందుకోసం భక్తులు ఎంతో ఆశగా ఏది చూశారని, కానీ మూడేళ్లు గడిచిన శిలాఫలకాలకే ప్రాజెక్టు పరిమితం కావడం బాధగా ఉందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం టీటీడీ ఉన్నత అధికారులు స్పందించి వెంటనే నిధులు విడుదల చేసి నిర్మాణ పనులను ప్రారంభించారని శ్యామ్ కుమార్ డిమాండ్ చేశారు.

Read Also- Crime News: పనిమనుషుల అసాధారణ దారుణం.. సినిమాలను తలపించే రీతిలో ఐదేళ్లపాటు..

Just In

01

Hyderabad Vijayawada Train: హైదరాబాద్-విజయవాడ ట్రైన్ జర్నీ 3 గంటలే!.. దక్షిణమధ్య రైల్వే అదిరిపోయే ప్రతిపాదన

Anil Ravipudi: శివాజీ వ్యాఖ్యలపై ఆసక్తికరంగా స్పందించిన అనిల్ రావిపూడి.. ఏమన్నారంటే?

Chiranjeevi: తమిళ స్టార్ దర్శకుడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా.. నిజమేనా?

Telangana Crime Report: వార్షిక క్రైమ్ రేట్ రిపోర్ట్ విడుదల చేసిన డీజీపీ.. కీలకమైన విషయాలు ఇవే

Om Shanti Shanti Shantihi: ‘సిన్నారి కోన’ పాటొచ్చింది.. తరుణ్, ఈషా రెబ్బా జంట ఎంత బావుందో!