Beauty OTT: కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే జీ 5 (ZEE5), ఈసారి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ అంకిత్ కొయ్య (Ankith Koyya), నిలఖి పాత్రా (Nilakhi Patra) జంటగా నటించిన సినిమా ‘బ్యూటీ’ (Beauty). థియేటర్లలో మంచి స్పందనను రాబట్టుకున్న ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. వాస్తవానికి ఈ సినిమా విడుదలైన చాలా కాలమైంది. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG) కంటే ముందే సెప్టెంబర్ 15వ తేదీనే విడుదలైంది. కానీ ఓటీటీలోకి రావడానికి మాత్రం చాలా టైమ్ తీసుకుంది. ఈ మధ్య నాలుగు వారాల గ్యాప్‌లోని అన్ని సినిమాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. మరి ఈ సినిమా ఎందుకు ఆలస్యమైందనేది.. వారికే తెలియాలి. ఇక ఈ సినిమా జనవరి 2 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్ కాబోతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోగానే, ఇంటిల్లిపాదీ కూర్చుని చూసే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిదని జీ5 వర్గాలు చెబుతున్నాయి.
Also Read- Mana Shankara Varaprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
అసలు కథేంటంటే?
ఇదొక ట్రయాంగిల్ ఎమోషన్ మామ! తండ్రి, కూతురు, ప్రియుడు.. ఈ ముగ్గురి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. నారాయణ (నరేష్) ఒక క్యాబ్ డ్రైవర్. తన ప్రపంచం అంతా తన కూతురు అలేఖ్య (నిలఖి పాత్రా)నే. కూతురి పుట్టినరోజుకు టూ వీలర్ కొనిస్తానని ప్రామిస్ చేస్తాడు. అటు అలేఖ్య ప్రియుడు అర్జున్ (అంకిత్ కొయ్య) కూడా ఆమెకు బండి కొనిస్తానని మాట ఇస్తాడు. ఏదో కారణం వల్ల తండ్రి తన మాట నిలబెట్టుకోలేకపోతాడు. దాంతో కోపంలో, ఆవేశంలో తండ్రితో గొడవపడి అలేఖ్య ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. కానీ, ఆవేశంలో తను తీసుకున్న ఆ నిర్ణయం అలేఖ్యను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టింది? తన కూతురిని కాపాడుకోవడానికి ఆ తండ్రి ఎంత దూరం వెళ్ళాడు? మధ్యలో అర్జున్ పడ్డ ఇబ్బందులేంటి? ఈ సంఘర్షణలో కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే ఈ సినిమా కథ.
Also Read- Allu Aravind: కొడుకుకి సక్సెస్ వస్తే వచ్చే ఆనందం.. నాకంటే బాగా ఎవరికీ తెలియదు!
ఎందుకు చూడాలంటే..
సీనియర్ నటుడు నరేష్ ఒక సామాన్య తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. కూతురి కోసం ఆయన పడే వేదన ప్రతి తండ్రికి కనెక్ట్ అవుతుంది. అలాగే అంకిత్ తన నేచురల్ యాక్టింగ్‌తో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇందులో కూడా యూత్ మెచ్చే ఎమోషన్స్ బాగా పండించాడు. కేవలం ఇందులో లవ్ స్టోరీ మాత్రమే కాదు, తండ్రి-కూతుళ్ళ మధ్య ఉండే ఆత్మీయతను, అపార్థాలను చాలా రియలిస్టిక్‌గా చూపించారు. ఈ వీకెండ్‌లో మనసుకి హత్తుకునే ఒక మంచి కథ చూడాలనుకుంటే ‘బ్యూటీ’కి ఫిక్స్ అయిపోవచ్చు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా.. జీ 5 ఓటీటీలో ఎలాంటి ఆదరణను రాబట్టుకుంటుందో తెలియాలంటే మాత్రం జనవరి 2వ తేదీ వరకు వెయిట్ చేయకతప్పదు.
A love story that turns into a mystery… 💔
Beauty Trailer is here!Get ready for #Beauty
Premieres 2nd January @AnkithKoyyaLive #NilakhiPatra @ItsActorNaresh @JSSVARDHAN @VijaypalreddyA @iamraj20 @shriesaidaara @__SaNaRe @VijaiBulganin @AdithyarkM @LakshmiMeghanaK pic.twitter.com/aZgbCRV6nw— ZEE5 Telugu (@ZEE5Telugu) December 30, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

