Allu Aravind: ఆది సాయి కుమార్ (Aadi Saikumar) హీరోగా నటించిన ‘శంబాల’ (Shambhala) చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకుడు. డిసెంబర్ 25న విడుదలై విజయవంతంగా థియేటర్లో ప్రదర్శించబడుతుండటంతో.. చిత్రయూనిట్ సంతోషాన్ని తెలిపేందుకు విజయోత్సవ వేడుకను డివైన్ బ్లాక్‌బస్టర్ పేరుతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దర్శకులు వశిష్ట, బాబీ, యంగ్ హీరో సందీప్ కిషన్, రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read- ibomma Ravi Case: ‘ఐబొమ్మ రవి కేసు’.. సంచలన విషయాలు చెప్పిన సైబర్ క్రైమ్ డీసీపీ!
నేను ముందుంటాను
ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. ‘శంబాల’ సినిమాను యుగంధర్ ముని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కుమార్‌తో మాకు మూడు తరాల అనుబంధం ఉంది. ‘శంబాల’ ట్రైలర్ చూసిన వెంటనే ఆదికి అల్లు అర్జున్ మెసేజ్ పెట్టాడు. కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే ఆనందం నాకంటే ఎవరికి బాగా తెలుస్తుంది. నా కుటుంబంలోని వ్యక్తి సక్సెస్ అయినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో.. ఆ ఆనందాన్ని పంచుకోవడానికే నేను ఇక్కడకు వచ్చాను. కొంచెం ఆలస్యమైనా కూడా ఆది అద్భుతంగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక నుంచి ఆది హైవే ఎక్కినట్టుగా దూసుకుపోవాలని, బ్రహ్మాండమైన పాత్రలు ఎంచుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అర్చనా ఐయ్యర్ డివైన్ పాత్రను అద్భుతంగా పోషించింది. బేబీ చైత్ర అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించింది. ఇలాంటి కథను, దర్శకుడిని నమ్మి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. ఆది సక్సెస్ అయితే.. గొప్పవాడు అయితే సంతోషపడే వ్యక్తుల్లో నేను ముందుంటాను. ‘శంబాల’ మూవీని చూసి నేను చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చారు.
Also Read- The Raja Saab Trailer: ‘ది రాజా సాబ్’ ట్రైలర్ 2.ఓ వచ్చేసింది. ఇది కదా కావాల్సింది!
నిర్మాతలు సంతోషంగా ఉంటే..
సాయి కుమార్ (Saikumar) మాట్లాడుతూ.. అమ్మానాన్నల ఆశీర్వాదంతో 50 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇప్పుడు ఇలా ‘శంబాల’తో సక్సెస్ చేసి మరోసారి ఆడియెన్స్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. సినిమా ఫ్లాప్ అయినా ప్రయత్నం ఆపవద్దు అని మా అమ్మ నాకు చెబుతుండేవారు. అదే మాట నేను ఆదికి చెబుతూ వస్తున్నాను. నా సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఇలా ‘శంబాల’తో హిట్టు రావడం చాలా ఆనందంగా ఉంది. మహీధర్ రెడ్డి, రాజశేఖర్ ఎంతో ప్యాషన్‌తో ఈ మూవీని నిర్మించారు. నిర్మాతలు సంతోషంగా ఉన్నంత వరకు ఇండస్ట్రీ ఎప్పుడూ చల్లగా ఉంటుంది. నిర్మాత పెట్టిన ఖర్చు, దాంతో పాటుగా లాభాలు రావాలి. యుగంధర్ చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎక్కువ మాట్లాడరు. ‘ప్రస్థానం’ నుంచి సందీప్ కిషన్‌తో అదే అనుబంధం ఉంది. కోన వెంకట్ నాకు ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు. ‘నువ్వుగా వెళ్లి సక్సెస్ అయి రా’ అని నాతో మా నాన్న చెప్పారు. అదే మాటని ఆదికి నేను చెప్పాను. ఆది కూడా ఎక్కువగా మాట్లాడడు. ‘ప్రేమ కావాలి’ నుంచి ఇప్పటి వరకు ఆది తన వంతుగా కష్టపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ‘శంబాల’తో విజయం సాధించాడు. ‘శంబాల’ ప్రివ్యూని చూసి ప్రతీ ఒక్కరూ పాజిటివ్‌గానే స్పందించారు. ప్రతీ ఒక్కరూ ‘మన ఆది హిట్టు కొట్టారు’ అని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు. ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

