Siddu Jonnalagadda: టాలీవుడ్ యువ సంచలనం, ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ 40వ చిత్రాన్ని సిద్ధుతో ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి కల్ట్ క్లాసిక్ హిట్‌ను అందించిన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్‌జే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. ‘డిజె టిల్లు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ స్టార్ బాయ్, ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.
ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద బలం దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్‌జే. తన మొదటి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తోనే తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా డిటెక్టివ్ కామెడీని పరిచయం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ టైమింగ్, స్వరూప్ మార్క్ స్క్రీన్ ప్లే తోడైతే ఈ సినిమా మరో విభిన్నమైన జోనర్‌లో ఉండబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. “ప్రొడక్షన్ నెం. 40” గా వస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే, ఇదొక వినూత్నమైన కథాంశంతో సాగే చిత్రమని అర్థమవుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read also-Naga Vamsi: టికెట్ ధరల గురించి నిర్మాత నాగవంశీ ఏం చెప్పారంటే?.. రూ.99 అందుకే కష్టం..
యూత్ ఐకాన్ సిద్ధు జొన్నలగడ్డ తన ఎనర్జిటిక్ నటనతో ప్రేక్షకులను అలరించనున్నారు. స్వరూప్ ఆర్ఎస్‌జే ఈసారి ఏ తరహా కథతో వస్తారోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తోంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ చేతిలో ‘టిల్లు క్యూబ్’, ‘తెలుసు కదా’ వంటి భారీ సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కడంతో సిద్ధు లైనప్ మరింత స్ట్రాంగ్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. క్రేజీ కాంబినేషన్ కుదరడంతో ఈ సినిమా నుంచి మరిన్ని వశేషాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Before the #Badass arrives… 🔥
Let’s have some FUN. 😎Coming back with another crazy entertainer 💥
Star 🌟 boy @Siddubuoyoffl x Sithara Entertainments’ – #ProductionNo40
Directed by @swarooprsj @SitharaEnts #SaiSoujanya pic.twitter.com/KT5wpNZrG4
— Naga Vamsi (@vamsi84) December 30, 2025

