Bandla Ganesh: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘బ్లాక్‌బస్టర్ నిర్మాత’గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న బండ్ల గణేష్, మరో కీలక అడుగు వేశారు. ఇప్పటికే ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ ద్వారా ఇండస్ట్రీకి భారీ విజయాలను అందించిన ఆయన, తాజాగా తన రెండో నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త బ్యానర్‌కు ‘బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్’ (BG BLOCKBUSTERS) అని పేరు పెట్టారు.
Read also-Naga Vamsi: టికెట్ ధరల గురించి నిర్మాత నాగవంశీ ఏం చెప్పారంటే?.. రూ.99 అందుకే కష్టం..
ఈ సందర్భంగా బండ్ల గణేష్ తన సోషల్ మీడియా వేదికగా ఎంతో గర్వంగా, భావోద్వేగంతో ఈ విషయాన్ని పంచుకున్నారు. “నేను నా రెండో బ్యానర్ ‘BG BLOCKBUSTERS’ను ప్రకటిస్తున్నాను. రాజీలేని, నిజాయితీతో కూడిన సినిమాలను ప్రోత్సహించడమే మా ప్రాథమిక లక్ష్యం. ఈ బ్యానర్ కింద, సరిహద్దులను చెరిపివేసే గుండెలను హత్తుకునే సరికొత్త కథలను నేను మీకు చెప్పబోతున్నాను” అంటూ తన ఉద్దేశాన్ని చాటిచెప్పారు.
Read also-Nandini Suicide: ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సీరియల్ నటి నందిని.. ఎందుకంటే?
బండ్ల గణేష్ గతంలో పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్), ఎన్టీఆర్ (బాద్‌షా, టెంపర్), రవితేజ (ఆంజనేయులు) వంటి అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. అయితే, ఈ రెండో బ్యానర్ ద్వారా ఆయన కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు పెద్దపీట వేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. బండ్ల గణేష్ సినిమా ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి, అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌లలో ఒకరిగా ఎదిగారు. మధ్యలో కొద్దిరోజులు నిర్మాణానికి దూరంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు పూర్తి శక్తితో, ఒక కొత్త విజన్‌తో మళ్ళీ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ బ్యానర్‌లో మొదటి చిత్రం ఎవరితో ఉండబోతోంది? మొదటి ప్రాజెక్ట్ వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారు? అనే విషయాలపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. తనదైన వాక్చాతుర్యంతో, సినిమాలపై ఉన్న మక్కువతో బండ్ల గణేష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

