ibomma Ravi Case: షాకింగ్ విషయాలు చెప్పిన సైబర్ క్రైమ్ డీసీపీ!
Cyber Crime DCP Aravind Babu (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

ibomma Ravi Case: ‘ఐబొమ్మ రవి కేసు’.. సంచలన విషయాలు చెప్పిన సైబర్ క్రైమ్ డీసీపీ!

ibomma Ravi Case: ఐ బొమ్మ వెబ్​ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి (iBomma Ravi) పోలీస్​ కస్టడీ సోమవారంతో ముగిసింది. ఇప్పటికే రవిని రెండుసార్లు కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైం పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో రవి ఎలాంటి కీలక వివరాలు వెల్లడించలేదు. దాంతో పోలీసులు ఇటీవల రవిపై మరో నాలుగు కేసులు ఉన్నాయని, వాటిలో విచారణ చేసేందుకు కస్టడీకి అనుమతించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, అతని తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఇప్పటికే రవిని రెండుసార్లు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారని చెప్పారు. విచారణ పేర రవిని ఇబ్బందులు పెడుతున్నారని, కస్టడీకి అనుమతించకుండా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అదే సమయంలో రవికి బెయిల్​ మంజూరు చేస్తే కేసును పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్​ కోర్టుకు తెలపడంతో.. రవి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి, అతనిపై ఉన్న నాలుగు కేసుల్లో కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ కస్టడీ సోమవారంతో ముగిసింది. ఈ క్రమంలో ‘ఐబొమ్మ రవి కేసు’కు సంబంధించి సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు (Cyber Crime DCP Aravind Babu) సంచలన విషయాలను తెలియజేశారు.

Also Read- Jr NTR: ఢిల్లీ హైకోర్టు‌కు కృతజ్ఞతలు తెలిపిన మ్యాన్ ఆఫ్ మాసెస్.. మ్యాటర్ ఏంటంటే?

మిగతా ఇద్దరి స్నేహితులను కూడా విచారిస్తాం

ఆయన మాట్లాడుతూ.. ‘‘ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో ఫేక్ ఐడీల సమాచారం సేకరించాము. గతంలో ఐబొమ్మ రవికి తెలిసిన ముగ్గురు స్నేహితుల ఐడీల ద్వారానే ఫేక్ ఐడీలు సృష్టించాడు. ఈ విచారణలో రవికి చెందిన రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేశాము. అతనికి బెట్టింగ్ యాప్స్‌తో ఉన్న సంబంధాలు.. ఆర్థిక లావాదేవీలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఇతర పైరసీ వెబ్‌సైట్స్‌తో రవికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నాం. కరేబియన్ దేశంలో ఉన్న రవి డేటా‌ని కూడా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రవి ప్రహ్లాద్, మరో ఇద్దరు స్నేహితులకు ఐబొమ్మ రవితో ఎలాంటి సంబంధాలు లేవు. వారికి తెలియకుండానే వారి డాక్యుమెంట్స్ తస్కరించి పైరసీ వ్యవహారాన్ని నడిపించాడు. ప్రహ్లాద్ విచారణలో కూడా ఐబొమ్మ రవితో సంబంధాలు లేవనే చెప్పాడు. త్వరలో మిగతా ఇద్దరి స్నేహితులను కూడా విచారిస్తాం. పాస్‌పోర్ట్ మాత్రం ఇమ్మడి రవి పేరుతోనే తీసుకున్న రవి, ఈ ముగ్గురు స్నేహితుల పేర్లతో పలు వెబ్‌సైట్స్ కొనుగోలు చేసినట్లుగా గమనించాం. హాస్పిటల్ ఇన్, సప్లయర్స్ ఇన్ వెబ్‌సైట్స్‌ను బినామీ పేర్లతో కొనుగోలు చేసిన ఐబొమ్మ రవి.. ఆ రెండు వెబ్‌సైట్స్ సక్సెస్ కాకపోవడంతో ఐబొమ్మను సృష్టించాడు. మూవీ రూల్స్‌తో పాటు మరికొన్ని పైరసి వెబ్‌సైట్స్‌‌లపై కూడా చర్యలు తీసుకుంటాం. ఇకపై పైరసీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Shambhala: ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ‘శంబాల’పై రెబల్ స్టార్!

ఏపీకే ఫైల్స్ వస్తే ఓపెన్ చేయవద్దు

అంతేకాదు, న్యూ ఇయర్ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఆఫర్ల పేరుతో లింకులు పంపించి సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి.. గుర్తుతెలియని ఫోన్ నెంబర్ల నుంచి ఏవైనా ఏపీకే ఫైల్స్ వస్తే ఓపెన్ చేయవద్దు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేస్తే ఫోన్‌లో ఉన్న విలువైన సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటివి మోసాలు ఎక్కువగా ఫెస్టివల్ సీజన్‌లో జరుగుతుంటాయి. గుర్తుతెలియని నెంబర్స్‌తో పాటు వాట్సాప్ గ్రూప్‌లలో వచ్చే ఏపీకే ఫైల్స్‌తో కూడా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో సైబర్ నేరాలపై నిరంతరం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. అందరూ అలెర్ట్‌గా ఉండాలని కోరారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Cyber Crime Scam: ఖాకీలకే సైబర్​ క్రిమినల్స్ ఉచ్చు… ఏం చేశారంటే?

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?

Spirit: ప్రభాస్, సందీప్ వంగా ఇవ్వబోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇదేనా?

Mahabubabad News: ఎవరి మాటా వినడు.. సీతయ్యలా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి

Allu Arjun Fans: సీఎం రేవంత్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు