January Bank Holidays: జనవరిలో భారీగా బ్యాంక్ హాలిడేస్..
January-Bank (Image source X)
Telangana News, ఆంధ్రప్రదేశ్

January Bank Holidays: జనవరిలో భారీగా బ్యాంక్ హాలిడేస్.. ముందే జాగ్రత్త పడండి మరి.. తేదీలు ఇవే

January Bank Holidays: ఆర్థిక కార్యకలాపాలలో బ్యాంకులు ఎంతటి కీలకపాత్ర పోషిస్తున్నాయో అందరికీ తెలిసిందే. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలు పెద్ద సంఖ్యలోనే జరుగుతున్నప్పటికీ, ప్రత్యేకంగా బ్యాంకుతో ముడిపడిన సేవలు చాలానే ఉన్నాయి. అయితే, జాతీయ సెలవులు, ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవు రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పాటు పనిచేయవు. దీంతో, బ్యాంకు హాలిడేస్‌పై అవగాహనతో ముందుగానే పనులు చక్కబెట్టుకోవడం, సరైన ప్లానింగ్‌తో ఉండడం చాలా ముఖ్యం. లేదంటే, అనివార్యమైన ఇబ్బందులను చవిచూడాల్సి ఉంటుంది. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సి వస్తోందంటే, మరో రెండు రోజుల్లో డిసెంబర్ నెల ముగిసిపోయి, కొత్త నెల జనవరిలో అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి, జనవరి నెల అధికారిక సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడేస్ లిస్ట్‌ను (January Bank Holidays) చెక్ చేసుకుంటే, తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.

హాలిడేస్ లిస్ట్ ఇదే

1 జనవరి – న్యూఇయర్ సందర్భంగా (కొన్ని రాష్ట్రాలలో).
6 జనవరి – గురు గోబింద్ సింగ్ జయంతి (కొన్ని రాష్ట్రాలలో).
11 జనవరి – మిషనరీ డే (మిజోరాం).
12 జనవరి – స్వామి వివేకానంద జయంతి (పశ్చిమ బెంగాల్).
13 జనవరి – లోహ్రీ (పంజాబ్, మరికొన్ని రాష్ట్రాలలో).
14 జనవరి – సంక్రాంతి (తమిళనాడు).
15 జనవరి – తిరువల్లువార్ డే (తమిళనాడు).
15 జనవరి – మాఘ్ బిహు (అసోం).
23 జనవరి – నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (వెస్ట్ బెంగాల్, త్రిపుర, ఒడిశా).
24 జనవరి – నాలుగవ శనివారం (దేశవ్యాప్తంగా బ్యాంక్ హాలిడేస్).
26 జనవరి – గణతంత్ర దినోత్సవం (దేశవ్యాప్తంగా బ్యాంక్ హాలిడేస్).

Read Also- UP Rampur Accident: అయ్యబాబోయ్.. భయంకరమైన యాక్సిడెంట్.. బొలెరోపై బోల్తాపడ్డ లారీ!

తెలుగు రాష్ట్రాలలో..

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా బ్యాంకులకు ప్రకటిత తేదీలలో హాలిడేస్ ఉంటాయి. అయితే, ఏయే తేదీలలో ఉంటాయనేది ఆర్బీఐ క్యాలెండర్‌లో పేర్కొనలేదు. పండుగ తేదీలలో మార్పులు ఉంటాయి కాబట్టి పేర్కొనలేదు. అయితే, ఏపీ ప్రభుత్వ హాలిడేస్ జాబితా ప్రకారం, జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉన్నాయి. మరి, బ్యాంకు హాలిడేస్ ఏ రోజుల్లో ఉంటాయో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ చాలా సందడిగా జరుగుతుంది. దాదాపు అందరూ సొంతూళ్లకు వెళ్లి, కుటుంబ సభ్యుల మధ్య పండుగ జరుపుకుంటారు. సొంతూరిలో బంధువులు, స్నేహితులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా గడుపుంటారు. మరికొందరు టూర్లకు వెళుతుంటారు. పెద్ద ఎత్తున షాపింగ్ కూడా చేస్తుంటారు. ఇవన్నీ సరదాగా, సంతోషంగా జరగాలంటే చేతిలో డబ్బు ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి, బ్యాంక్ హాలిడేస్ లిస్ట్‌ను ముందుగానే తెలుసుకొని, తగిన రీతిలో ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.

Read Also- SP Dr P Shabarish: అల్లర్లు తగ్గాయి.. అత్యాచారాలు, హత్యలు పెరిగాయ్.. మహబూబాబాద్ క్రైమ్ రిపోర్ట్

Just In

01

Cyber Crime Scam: ఖాకీలకే సైబర్​ క్రిమినల్స్ ఉచ్చు… ఏం చేశారంటే?

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?

Spirit: ప్రభాస్, సందీప్ వంగా ఇవ్వబోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇదేనా?

Mahabubabad News: ఎవరి మాటా వినడు.. సీతయ్యలా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి

Allu Arjun Fans: సీఎం రేవంత్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు