POCSO Act Case: బాలికపై అత్యాచార కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష
బాధితురాలికి రూ.5 లక్షల పరిహారానికి ఆదేశాలు
పోక్సో చట్టం కేసులో మేడ్చల్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ జడ్జి వెంకటేష్ తీర్పు
మేడ్చల్, స్వేచ్ఛ: ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, సమాజంలో ఎంత అవగాహన కల్పిస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. బాలికలపై కూడా దుర్మార్గులు లైంగిక దాడులకు తెగబడుతున్నారు. అలాంటివారికి హెచ్చరికగా మరో కీలక తీర్పు వెలువడింది. మైనర్ బాలికపై అత్యాచారం ఘటనకు సంబంధించిన నమోదైన పోక్స్ కేసులో మేడ్చల్ స్పెషల్ కోర్ట్ సోమవారం తీర్పు (POCSO Act Case) వెలువరించింది.
ఈ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఏకంగా 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ మేరకు మేడ్చల్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ జడ్జి కె.వెంకటేష్ సోమవారం నాడు తీర్పు వెలువరించారు. బాధితురాలికి ఐదు లక్షల నగదు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ తీర్పునకు సంబంధించిన వివరాలను మేడ్చల్ పీపీ విజయ్ రెడ్డి, అడ్వకేట్ రోజా మీడియా వెల్లడించారు. 2022 జూన్ 20న మేడ్చల్ పట్టణంలో తమ బాలిక కనబడటం లేదని కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించి మేడ్చల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి జరిగిన నేరాన్ని తేల్చారు. నిందితుడు బికాస్ కుమార్ నాయక్‌ను అరెస్టు చేసి, విచారణ తర్వాత రిమాండ్‌కు తరలించారు.
Read Also- Hindu Family Home Fire: బంగ్లాదేశ్‌లో ఆగని ఊచకోత.. హిందువులే టార్గెట్.. ఐదు ఇళ్లకు నిప్పు
న్యాయ విచారణలో బాగంగా మేడ్చల్ భరోసా సెంటర్‌లో బాధిత బాలికను అప్పగించారు. మేడ్చల్ భరోసా సెంటర్ సిబ్బంది బాధిత కుటుంబ సభ్యుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి, కోర్టుకు సహకరించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. కేసు పూర్వాపరాలను విచారించిన న్యాయస్థానం దాదాపు 13 మంది సాక్షులను విచారించింది. బాధిత బాలికను (15) తండ్రి వయస్సు ఉన్న బికాస్ కుమార్ నాయక్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి ఒడిశా తీసుకెళ్లి కిడ్నాప్ చేసి బలవంతంగా అత్యాచారం చేసినట్టుగా రుజువైంది. దీంతో, సోమవారం న్యాయాధికారి నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5,000 ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.5 లక్షల నగదు ఇవ్వాలని తీర్పులో స్పష్టం చేశారు.
Read Also- Bank Loan News: ఓ వ్యక్తి రూ.1.7 కోట్ల లోన్ తీసుకుంటే 11 ఏళ్లలో రూ.147 కోట్లకు పెరిగింది.. ఎందుకంటే?

