Naa Anveshana: ట్రోలర్స్ దెబ్బకి నా అన్వేష్ శివాజీకి క్షమాపణలు చెప్పాడు. గతంలో శివాజీ మాట్లాడిన పాత వీడియోను చూపిస్తూ విదేశీ యాత్రికుడు తెగ సంబర పడిపోతున్నాడు. ఆ వీడియోలో మన శివాజీ గారు నా అభిమాని అంట నాకు ఈ విషయం తెలీదు ఇది వినండి అని.. నా అన్వేష్ కి నేను పెద్ద ఫ్యాన్ ను అని వాడు మామూలోడు కాదని చెప్పడంతో ఇది చూసి నిజంగా షాక్ అయ్యాను అని నా అన్వేష్ ఇంస్టా లో షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే, నా కోపాన్ని పక్కన పెట్టి నేను మిమ్మల్ని అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. మీరు ఎలాగా అయితే సామాను అన్న పదాలను ఎలా అయితే వెనక్కి తీసుకున్నారో ? నేను కూడా ఆ మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెబుతున్నాను.
నిజాలు మాట్లాడుకుందాం.. ఇప్పుడు మీరు ఒక అమ్మాయి చీర కట్టుకోవాలని ఎలా అన్నారో .. మనం పురణాల్లోకి వెళ్దాం త్రేతా యుగం, ద్వాపర యుగాల్లోకి వెళ్దాం.. త్రేతా యుగంలో సీత పద్దతిగా చీర కట్టుకుంటే రావణుడు అపహరించుకుపోయాడు. ఆ తర్వాత రావణుడు చచ్చిపోయాడు. ద్వాపర యుగంలో ద్రౌపదిని కీచకుడు , సైంధవుడు ఇబ్బంది పెట్టాలని చూశారు. వాళ్ళు కూడా చనిపోయారు. నేను మహా భారతాన్ని 60 రోజుల ఉపవాసంతో చెప్పాను. ఆ తర్వాత రామాయణం కూడా మొదలు పెడతాను. ఆడదాన్ని తాకడానికి చూసిన వాళ్ళందరూ చనిపోయారు. 2024, 2025 లో ఎన్నో అత్యాచారాలు జరిగాయి. కానీ, ఒక్కరికి కూడా సరైన శిక్ష పడలేదు.
కాబట్టి మనం ఆ మొత్తం గోడవల్లో అమ్మాయి చీర కట్టు విధానం గురించి కాదు.. అబ్బాయి మైండ్ సెట్ మారాలని మాట్లాడి ఉంటే చాలా మంచిగా ఉండేదని నా అన్వేష్ చెప్పుకొచ్చాడు.
Also Read: Home Remedies: కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే, ఈ సహజ చిట్కాలతో చెక్ పెట్టేయండి!

