TFCC: నూతన అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు..
D Suresh Babu (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు.. కీలక పదవులు వీరికే!

TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు (Daggubati Suresh Babu) ఎన్నికయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఎన్నికల పర్వం ఆదివారం ముగిసింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఈ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. మాములుగా అసలు ఈ ఎన్నికల గురించి ఎవరూ పట్టించుకోరు, ఎవరికీ తెలియదు కూడా. కానీ, ఈసారి చివరి నిమిషం వరకు కాస్త హడావుడి నడిచింది. కారణం సీనియర్స్ వర్సెస్ కొత్తవారు అనే రేంజ్‌లో ఈ ఎన్నికలు జరిగాయి. ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ (Progressive Panel), ‘మన ప్యానెల్’ (Mana Panel) అంటూ హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో.. ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. ఆ ప్యానెల్ నుంచి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా (TFCC President) దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. మొత్తంగా 44 కార్యవర్గ (EC) సభ్యుల స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 స్థానాలను కైవసం చేసుకుంది. మన ప్యానెల్ కేవలం 15 స్థానాలను మాత్రమే దక్కించుకుంది.

Also Read- Thalapathy Vijay: సినిమాలకు గుడ్‌బై.. అధికారికంగా ప్రకటించిన దళపతి విజయ్

అనుభవానికే పెద్ద పీట

ఎవరూ ఎన్ని గెలిచినా, రెండు ప్యానెల్స్‌లో నుంచి గెలిచిన వారంతా ఎన్నికల తర్వాత కలిసే పని చేసుకుంటారు కాబట్టి.. ఇక పోటీ ఉండదనే భావించవచ్చు. అందులోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎంతో అనుభవజ్ఞుడైన దగ్గుబాటి సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు కాబట్టి.. ఇక ఇతరులెవరూ మాట్లాడరు కూడా. ఎందుకంటే, ఆయన అనుభవం అలాంటిది. సురేష్ బాబుతో పాటు యువ నిర్మాతలకు కూడా ఈసారి పాలనా అవకాశాలను కల్పించారు. కీలక పదవుల్లో కొత్తవారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో ఈసారి ఎన్నికైన వారంతా టాలీవుడ్‌లో పలు మార్పులు తీసుకువస్తారని అంతా భావిస్తున్నారు.

Also Read- O Andala Rakshasi: నేటితరం ఆడపిల్లలు ఎలా ఉండాలో ‘ఓ అందాల రాక్షసి’ చెబుతుందట!

కీలక పదవులు వీరికే..

TFCC నూతన అధ్యక్షుడిగా అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికవగా.. కీలక పదవుల్లో ఈసారి యువ నిర్మాతలకు కూడా అవకాశం కల్పించారు. ఆ పదవుల విషయానికి వస్తే.. వైస్ ప్రెసిడెంట్స్‌గా నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, భరత్ చౌదరి, పి. కిరణ్ బాధ్యతలు చేపట్టారు. సెక్రటరీలుగా హైదరాబాద్‌కు చెందిన కె. అశోక్ కుమార్, విజయవాడకు చెందిన కె.వి.వి. ప్రసాద్.. జాయింట్ సెక్రటరీగా హైదరాబాద్‌కు చెందిన ఎమ్. విజయేందర్ రెడ్డి, మోహన్ వడ్లపట్ల, విజయవాడకు చెందిన జి. వీరనారాయణ బాబు, గుంతకల్‌కు చెందిన జి. మహేశ్వర్ రెడ్డి, తిరుపతికి చెందిన ఎన్. నాగార్జున, విశాఖపట్నం నుంచి కె. అప్పలరాజు ఎన్నికయ్యారు. ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్‌ ఎంపికయ్యారు. కార్యవర్గం ఎన్నిక అనంతరం నూతన అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న లోకల్, నాన్ లోకల్ సమస్యను పరిష్కరించి, తెలుగు సినిమా ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తాం. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సపోర్ట్‌ను తీసుకుంటామని అన్నారు. అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ.. అందరం కలిసే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని, అంతా కలిసే పనిచేస్తామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kichcha Sudeepa: ఇతర ఇండస్ట్రీ స్టార్స్‌పై సుదీప్ సంచలన వ్యాఖ్యలు

Prabhas: పాన్ ఇండియా స్టారైనా.. పబ్లిక్‌లో మాట్లాడాలంటే ఇంకా సిగ్గే!

iBomma Ravi: రవి ప్రహ్లాద్‌ని పిలిపించిన అధికారులు.. ఐ బొమ్మ రవి కేసులో కీలక అప్డేట్!

Director Maruthi: మొన్న అన్ని నీతులు చెప్పావ్.. ఇదేంటి మారుతి?

Etela Rajender: నేను సీరియస్ పొలిటీషియన్.. ఎంపీ ఈటల హాట్ కామెంట్స్