విశాఖ కేజీహెచ్ (Vizag KGH)లో సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఉద్యోగం నుంచి తొలగించారన్న కోపంతో ఓ రౌడీ షీటర్ ఆసుపత్రిలో హల్ చల్ సృష్టించాడు. చిన్న పిల్లల వార్డ్ లో ఆక్సిజన్ పైపులని కట్ చేసే ప్రయత్నం చేశాడు. అది గమనించిన సెక్యూరిటీ గార్డ్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఆపేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డ్ ని కూడా అతను కత్తితో బెదిరించాడు.
సిబ్బంది సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రౌడీ షీటర్ రాజుని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పెనుప్రమాదం తప్పడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాజు ప్రవర్తన సరిగా లేకపోవడంతోనే వైజాగ్ కేజీహెచ్ (Vizag KGH) మేనేజ్మెంట్ నిందితుడిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.