O Andala Rakshasi: దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షెరాజ్ మెహదీ (Sheraz Mehdi).. ఇప్పుడు ‘ఓ అందాల రాక్షసి’ (O Andala Rakshasi) చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షెరాజ్ మెహదీ సరసన విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని స్కై ఈజ్ ది లిమిట్ (Sky Is The Limit) బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 2న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు.
Also Read- Huma Qureshi as Elizabeth: యష్ ‘టాక్సిక్’ సామ్రాజ్యంలో ‘ఎలిజబెత్’గా హుమా ఖురేషి.. పోస్టర్ పీక్స్..
ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు
ఈ కార్యక్రమంలో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. ‘ఓ అందాల రాక్షసి’ మూవీ జనవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. న్యూ ఇయర్ స్పెషల్‌గా వస్తున్న ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. ఏడాది మొత్తంలో ఇది చాలా మంచి సినిమా అని చెప్పుకునేలా కొన్ని సినిమాలుంటాయి. అలాంటి ఓ మంచి సినిమానే మా ‘ఓ అందాల రాక్షసి’. ఇందులో కృతి వర్మ, విహాన్షి హెగ్డే, నేహా దేశ్ పాండే, అఖిల, గీతా రెడ్డి, స్నేహా, ప్రియా దేశ్ పాల్, సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి వారంతా అద్భుతమైన పాత్రల్ని పోషించారు. అద్భుతమైన కంటెంట్‌తో రాబోతోన్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. అలాంటి కంటెంట్ ఇందులో ఉంది. మంచి సందేశాత్మక కథతో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందీ సినిమా. ఇందులో అద్భుతమైన ట్విస్ట్‌లు ఉంటాయి. అమ్మాయిలకు ఈ సినిమా విపరీతంగా నచ్చేస్తుందని అన్నారు.
Also Read- Chiranjeevi Anil: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మరో పోస్టర్ రిలీజ్.. ఇంకా పదిహేను రోజులే..
ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెఫ్ట్‌తో..
కథ, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకు కథ, మాటల్ని రాశాను. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు ఓ మంచి ఫీల్‌తో బయటకు వస్తారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే మంచి కాన్సెప్ట్‌తో ఈ మూవీని చేశాం. మా హీరో షెరాజ్ అద్భుతంగా నటించారు. ఆయన ఈ సినిమాకు డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోగా మ్యాజిక్ చేశారు. కృతి వర్మ హిందీలో చాలా ఫేమస్. విహాన్షి అద్భుతంగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. జనవరి 2న అందరూ ఈ మూవీని థియేటర్‌లో చూడాలని కోరుతున్నానని తెలిపారు. హీరోయిన్లు కృతి వర్మ, విహాన్సి హెగ్డే మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన షెరాజ్‌కు ధన్యవాదాలని అన్నారు. అమ్మాయిల్ని మోసం చేస్తే.. ఆ అందం రాక్షసిగా మారుతుంది. అదే మా ‘ఓ అందాల రాక్షసి’ అని తెలుపుతూ.. జనవరి 2న ఆడియెన్స్ ఈ సినిమాను థియేటర్లలో చూసి సక్సెస్ చేయాలని కోరారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

