Dhruv Rathee: ధృవ్ రాఠీ వీడియోలో జాన్వీ కపూర్ ఫోటో..
janvi-kapoor(image :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీ వీడియోలో జాన్వీ కపూర్ ఫోటో.. సోషల్ మీడియా వార్..

Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీ తన వీడియో థంబ్‌నెయిల్‌లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ‘బిఫోర్ అండ్ ఆఫ్టర్’ ఫోటోలను ఉపయోగించడం సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీసింది. దీనిపై వస్తున్న విమర్శలకు, రాజకీయ ఆరోపణలకు సమాధానమిస్తూ రాఠీ ఒక వివరణాత్మక వీడియోను విడుదల చేశారు.

Read also-RajaSaab Prabhas: 15 ఏళ్ల తర్వాత వస్తున్నా.. క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు.. ప్రభాస్..

వివాదం నేపథ్యం

ధృవ్ రాఠీ ‘ఫేక్ బ్యూటీ’, ప్లాస్టిక్ సర్జరీల ప్రభావంపై ఒక సుదీర్ఘ వీడియోను రూపొందించారు. అయితే, సరిగ్గా అదే సమయంలో జాన్వీ కపూర్ బంగ్లాదేశ్‌లోని హిందువులకు మద్దతుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. దీంతో, జాన్వీ హిందువులకు మద్దతు ఇచ్చినందుకే రాఠీ ఆమెను అవమానిస్తూ వీడియో చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. “Wake Up Hindus” అంటూ అనేక పోస్ట్‌లు వైరల్ అయ్యాయి.

ధృవ్ రాఠీ ఇచ్చిన కౌంటర్

తనపై వస్తున్న ఆరోపణలను రాఠీ తీవ్రంగా ఖండించారు. ప్రజలు కనీస ఆలోచన లేకుండా ఐటీ సెల్ ప్రచారాలను నమ్ముతున్నారని ఆయన విమర్శించారు. “జాన్వీ కపూర్ పోస్ట్ పెట్టిన అరగంటలోనే నేను అర గంట నిడివి గల వీడియోను ఎలా అప్‌లోడ్ చేస్తాను? అంత తక్కువ సమయంలో రీసెర్చ్, షూటింగ్, ఎడిటింగ్ చేయడం సాధ్యమేనా?” అని ఆయన ప్రశ్నించారు. బంగ్లాదేశ్ హిందువుల పట్ల జరుగుతున్న అన్యాయంపై తాను కూడా గతంలో వీడియోలు చేశానని, అలాంటప్పుడు అదే విషయాన్ని చెప్పిన జాన్వీని తాను ఎందుకు విమర్శిస్తానని స్పష్టం చేశారు. “నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీదే చెబుతాను. పరోక్షంగా విమర్శించే అలవాటు నాకు లేదు. నేను ఏ సెలబ్రిటీకి భయపడను,” అని ఆయన ఘాటుగా స్పందించారు.

Read also-Kalaga Kathaga: ‘ఛాంపియన్’ నుంచి మనసును మీటే మెలోడీ ‘కలగా కథగా’ లిరికల్ వీడియో వచ్చేసింది..

వీడియో ఉద్దేశ్యం ఏమిటి?

ఈ వీడియో కేవలం ప్లాస్టిక్ సర్జరీ వల్ల సమాజంపై, ముఖ్యంగా యువతపై పడే మానసిక ప్రభావం గురించి అని రాఠీ వివరించారు. జాన్వీ కపూర్ తన కాస్మెటిక్ సర్జరీల గురించి గతంలో బహిరంగంగా మాట్లాడినందునే, ఒక ఉదాహరణగా ఆమె ఫోటోను థంబ్‌నెయిల్‌లో వాడినట్లు ఆయన తెలిపారు. వీడియోలో ఆమెను వ్యక్తిగతంగా ఎక్కడా ప్రశ్నించలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కోణంలో ఒక విషయాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేస్తారో ఈ ఘటన మరోసారి నిరూపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Just In

01

Indian Army Alert: జమ్మూ కశ్మీర్‌లో యాక్టివ్ అయిన 30 మంది ఉగ్రవాదులు.. ఇంటెలిజెన్స్ బిగ్ అలర్ట్

Open AI: చాట్‌జీపీటీ మెడకు చుట్టుకున్న యువకుడి మృతి కేసు

CM Chandrababu: అయోధ్య రామయ్య సన్నిధిలో ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రత్యేక పూజలు

Medaram Jatara: మేడారం ఆలయానికి భారీగా పోటెత్తిన భక్తులు

Bhatti Vikramarka: అభివృద్ధిలో మధిర పట్టణం ఉరకలు పెట్టాలి: భట్టి విక్రమార్క