Jagan Fans: నడిరోడ్డుపై జగన్ ఫ్యాన్స్‌కు పోలీసుల ట్రీట్‌మెంట్‌
YSRCP (Image source X)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Jagan Fans: నడిరోడ్డుపై జగన్ ఫ్యాన్స్‌కు పోలీసుల స్ట్రాంగ్ ట్రీట్‌మెంట్‌

Jagan Fans: అభిమానం హద్దులు దాటి… రోడ్డుపై వెళుతున్న జనాలు బెదిరిపోయేలా అత్యుత్సాహం ప్రదర్శించిన పలువురు వైసీపీ కార్యకర్తలు (Jagan Fans) పోలీసుల ట్రీట్‌మెంట్‌ను చవిచూడాల్సి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజవర్గ పరిధిలోని నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో పలువురు జగన్ అభిమానులు ఇటీవల అతిగా ప్రవర్తించారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా, ‘2029లో గంగమ్మ జాతర.. రప్పా రప్పా’’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా దాదాపుగా రోడ్డు మీదే ఆ ఫ్లెక్సీ వద్ద మేకపోతును బలిచ్చారు. అక్కడితో కూడా ఆగకుండా రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. నరికిన తలను ఫ్లెక్సీ‌కు రుద్దుతూ జగన్ అనుకూల నినాదాలు చేశారు. నడిరోడ్డుపై జంతుబలికి పాల్పడినట్టు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాక తమదైన శైలిలో పోలీసులు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అనంతరం మెడికల్ చెకప్ కోసం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి స్థానిక పీహెచ్‌సీ వద్దకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిందిత వ్యక్తులను రోడ్డుపై నడిపించుకొని తీసుకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరెస్టైన ఆరుగురు వ్యక్తులూ రోడ్డుపై నడడానికి ఇబ్బందిపడుతూ, కుంటుతూ నడుస్తూ కనిపించారు.

Read Also- Battle Galwan: సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టీజర్ వచ్చేసింది.. గల్వాన్ వీరుల త్యాగానికి సెల్యూట్..

జనాలు భయపడేలా.. పద్ధతి కాదు

ఈ ఘటనను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. జంతు బలి ఇవ్వడమే కాకుండా, ఆ రక్తంతో ఫ్లెక్సీలకు అభిషేకం చేయడం వంటి భయానక దృశ్యాలు సామాన్య ప్రజలను, ముఖ్యంగా మహిళలు, పిల్లలను భయాందోళనకు గురిచేశాయనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పైశాచిక చర్యలు చేయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, బహిరంగ ప్రదేశాల్లో జంతువులను బలివ్వడం చట్టం వ్యతిరేకమని న్యాయనిపుణులు చెబుతున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అభిమానం ఉండొచ్చు కానీ, అది వికృత చేష్టలకు దారి తీయకూడదంటూ పలువురు విమర్శలు చేశారు. రాజకీయ నాయకులపై అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ, అది ఈ విధంగా మూఢనమ్మకాలకు, జంతు హింసకు లేదా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Also- GHMC: జీహెచ్ఎంసీలో విలీనమై 60 సర్కిళ్లుగా 12 జోన్లుగా ఏర్పాటు.. సరికొత్త పరిపాలనకు సర్కారు శ్రీకారం!

Just In

01

Hyderabad Crime Rate: హైదరాబాద్‌ క్రైమ్ రిపోర్ట్ విడుదల.. నేరాలు ఎలా ఉన్నాయంటే?

Football Match Funds: ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం వాడిన రూ.110 కోట్లపై ఎంక్వయిరీ చేస్తాం: హరీష్ రావు

KTR: తెలంగాణలో మార్పు మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్

Bigg Boss Sanjana: నా ప్రమేయం లేకుండా ఓ ఘటన.. బిగ్‌బాస్ టాప్-5 ఫైనలిస్ట్ సంజనా ప్రెస్‌మీట్

DGP Shivadhar Reddy: సీఐ, ఎస్‌ఐలపై డీజీపీ శివధర్ రెడ్డి ఫుల్ సీరియస్.. అలా చేస్తే వేటు!