Telangana Education: నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులు పట్టణాలకు వలసబాట పడుతున్నారు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించే పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించే స్కూల్స్ పై ప్రజలకు నమ్మక పోయింది. ప్రయివేట్, కార్పోరేట్ స్కూల్స్‌లో మాత్రమే నాణ్యమైన విద్య లబిస్తుందని విద్యార్ధుల తల్లిదండ్రుల అభిప్రాయం. ఆ అభిప్రాయాలకు భిన్నంగ ప్రభుత్వం స్కూల్స్ ను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రభుత్వ స్కూల్ కంటే కార్పోరేట్, ప్రయివేట్ స్కూల్స్ గోప్పకాదనే చర్చ సమాజంలో జరగాలని సీఎం రేవంత్ రెడ్డి తపన పడుతునట్లు తెలుస్తోంది.
మండలాల్లోని ప్రభుత్వం ఉన్నత పాఠశాలలను ఇంటర్నేషనల్ స్కూల్తో పోటీ పడే విధంగ రూపోందించాలని సీఎం, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ స్కూల్స్న పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రంగారెడ్డి జిల్లాలో మంచాల, ఆరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లాలో వంగూర్, పోల్కమ్పల్లి హైస్కూల్స్‌లో పనులు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని హైస్కూల్స్‌లో 80శాతం పనులు పూర్తి అయ్యాయి. మరో మూడు నెలల్లో మోడల్ స్కూల్‌గా నిర్మాణం పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ప్రారంభించనున్నట్లు సమాచారం.
పట్టణాల నుంచి పల్లేకు పోయే పరిస్థితి
విద్యాశాఖలో వస్తున్నమార్పులతో ఇక నుంచి పట్టణాల నుంచి పల్లేకు పోయే పరిస్థితి తప్పదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఫైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదే స్థాయిలో నడుస్తుంది. గత ఏడాది వరకు 760 విద్యార్ధులతో కొనసాగుతున్నప్రభుత్వ స్కూల్ నేడు అదనంగా 840 మంది నూతన విద్యార్ధుల చేరికతో బడి కళకళలాడుతుంది. గతేడాది వరకు స్ధానికంగా నివాసముండే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్ధులే ఆరుట్ల స్కూల్స్‌లో చదువుకునే వారు. నేడు పక్క మండలమైన ఇబ్రహీంపట్నం నుంచి 40 మంది విద్యార్ధులు పట్టణ నుంచి పల్లేలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్కు రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ నిర్వహాణలో తీసుకున్న మార్పుతోనే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతి మండలంలో అత్యధిక విస్తీర్ణం కలిగిన హైస్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా మార్పు చెందే అవకాశం ఉంది.
Also Read: Telangana Govt: మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట.. గత ప్రభుత్వం కంటే రూ.30 కోట్లకు పైగా నిధుల పెంపు!
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రత్యేకత
ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఆరుట్ల స్కూల్ విస్తీర్ణం 6 ఎకరాలు. ఈస్కూల్స్లో ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్లో విద్యాభోధన. ఉదయం టీఫిన్, మధ్యాహ్నాం లంచ్, సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రయివేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ స్కూల్ ను డే స్కాలర్‌గా నడింపించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు హైస్కూల్స్‌లో ఆరుట్ల స్కూల్స్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధి నుంచి ఎంపిక చేసిన స్కూల్స్కు నిధులు కేటాయించారు. అందులో భాగంగానే ఆరుట్ల స్కూల్స్ కు రూ.10కోట్లు, మంచాల స్కూల్స్ కు రూ.12 కోట్లు, వంగూర్, పొల్కంపల్లి స్కూల్స్కు రూ.15కోట్ల చొప్పున నిధులు విడుదల కేటాయింపు చేసినట్లు సమాచారం.
పైలెట్ ప్రాజెక్టులో నిర్మాణం చేసే స్కూల్స్‌లో క్రీడా ప్రాంగంణ, పరికరాలు, ల్యాబ్స్, లాబరేటర్స్, కంప్యూటర్ ట్రైనింగ్, లైబ్రరీ, వీడియో రూమ్స్, డైనింగ్ హాల్, రెస్ట్ రూమ్ తదితర వసతులను కల్పిస్తున్నారు. ఇవేకాకుండా స్కూల్ ఆవరణలో క్రీకేట్ బాక్స్, ఫుట్ బాల్, వాలీబాల్, బాస్కేట్ బాల్, టెన్నిస్, కోకో, కబ్బడ్డీ వంటి ప్రతి క్రీడాకు సంబంధిత కొర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు పీజక్స్, కెమిస్ట్రీ, బాటీనీ, జూవాలోజి ల్యాబ్స్… 8వ తరగతి వరకు ఒకటి, ఇంటర్ వరకు మరోకటి కలిపి రెండు లైబ్రరీలు, డైనింగ్ హాల్స్ 2 ఈవిధంగా ఆధునాతన పద్దతితో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రజల ముందుకు రాబోతున్నాయి. ఆరుట్లలో కోనసాగుతున్న స్కూల్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధులకు బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు సమాచారం.
తరగతికి పరిమితమైన విద్యార్ధులు
ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్, ఒక క్లాసుకు ఫ్రీ ప్రైమరీకి 25 మంది, అప్పర్ ప్రైమరీ 30 మంది, హైస్కూల్‌కు 40 మంది చోప్పున ఉంటారు. చిన్న పిల్లలుండే ప్రతి తరగతికి ఒక ఆయా తప్పనిసరిగా అందుబాటులో ఉండనుంది. దాంతో పాటు చిన్న, పెద్ద పిల్లలకు వేరువేరుగా వాష్ రూమ్‌లు సౌకర్యం. ఆధునాతన పద్దతిలో నిర్మించే టాయిలెట్స్, వాష్ రూమ్‌లు బాలబాలికలకు ప్రత్యేకంగా నిర్మాణం చేస్తున్నారు. ప్రతి విద్యార్ధిపై ప్రత్యేక నిఘా పెట్టేవిధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని స్కూల్స్
రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం భారం కావోద్దనే ఉద్దేశ్యంలో ప్రణాళికలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం విద్యావంతులైన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఎమ్మెల్సీ కొదండరాం లాంటి వాళ్లను విద్యాశాఖకు సలహాదారులుగా సీఎం నియామకం చేసుకోన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పైలెట్ ప్రాజెక్టు పనులు వాళ్లకే అప్పగించడం విశేషం. ఆ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పలు మార్పులకు శ్రీకారం చూడుతున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హైస్కూల్స్ లను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు మార్చాలనే సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే సుమారుగా నాలుగు ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న హైస్కూల్స్ ను గుర్తించి పరిసరా ప్రాంతంలో నడిపిస్తున్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, మోడల్ స్కూల్స్‌ను ఒకే క్యాంపస్లో నడిపించేందుకు సన్నహాలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధుల కోసం బస్సు సౌకర్యం కల్పించనున్నారు. ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోని స్కూల్స్ బలోపేతం చేయనున్నారు. స్కూల్స్ అభివృద్ధి కోసం ఖర్చు చేసే ప్రతి పైసా నియామకమైన 30 విద్యార్ధుల తల్లిదండ్రుల సమక్షంలో నిర్ణయం తీసుకుంటారు. కచ్చితం 10 మందికి పైగా సంతకాలు చేసి ఎజెండా ఉంటే తప్పా నగదు డ్రా చేసేందుకు అవకాశం లేకుండా కమీటి వేశారు.
Also Read: Telangana Jagruti: కవిత మీద అవాకులు పేలితే ఊరుకోబోం.. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్!

