Harish Rao: కాంగ్రెస్ ఉన్నంతకాలం యూరియా సమస్య తీరదా?
Harish Rao ( image credit: twitter)
Telangana News

Harish Rao: కాంగ్రెస్ ఉన్నంతకాలం యూరియా సమస్య తీరదా? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్!

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా? అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) ప్రశ్నించారు. రాష్ట్రంలో యూరియా కొరత – రైతుల కష్టాల పై  ఎక్స్ వేదికగా మండి పడ్డారు. సాగు గురించి తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేశారు.అందరినీ తొక్కుకుంటూ వచ్చాను అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు అని ఆరోపించారు. చిల్లర రాజకీయాలకు, విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Harish Rao: అబద్ధాలకు హద్దు పద్దు ఉంటది: మంత్రి ఉత్తంమ్‌పై హరీష్ రావు ఫైర్!

మీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా?

రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేదని అన్నారు. యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తెచ్చిన నీ యూరియా యాప్ ఏమైంది?యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?..మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుంటే, రైతులు మాత్రం తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరియా కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇదేనా మీరు చెప్పిన “మార్పు”, రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. గత సీజన్‌లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచి కూడా మీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా? అని ప్రశ్నించారు.

Also Read: Harish Rao: రెండేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే: హరీష్ రావు

Just In

01

Digvijaya Singh: మోదీ పాత ఫొటో షేర్ చేసిన దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్‌‌లో అంతర్గత విబేధాలు బహిర్గతం?

Kalvakuntla Kavitha: కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ.. పాలమూరు – రంగారెడ్డిపై పెట్టలే.. బీఆర్ఎస్‌పై కవిత ఫైర్

Shivaji Apology: విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన శివాజీ ఏం చెప్పారంటే?

Motorola: భారత మార్కెట్‌కు మోటరోలా ‘సిగ్నేచర్’ సిరీస్..

Accreditation Policy: అక్రిడిటేషన్ కొత్త జీఓను సవరించాలి.. రెండు కార్డుల విధానానికి స్వస్తి పలకాలి.. టియూడబ్ల్యూజే డిమాండ్!