Shekar Basha: శేఖర్ బాషా అందరికీ పరిచయమే. ఆర్జేగానే కాకుండా, బిగ్ బాస్ హౌస్‌లో కూడా తన ప్రత్యేకతని చాటుకుని, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెలబ్రిటీలకు సంబంధించి ఏవైనా వివాదాలు జరుగుతుంటే, శేఖర్ బాషా (Shekar Basha) ఎప్పుడూ తనదైన వాయిస్ వినిపించేందుకు ముందుకు వస్తుంటారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రిటీల తరుపున కూడా ఆయన మాట్లాడటం, విచారణ నిమిత్తం వాళ్ల తరపున హాజరై టైమ్ తీసుకోవడం వంటి విషయాలతో.. బాగానే వార్తలలో నిలిచారు. ఇప్పుడు టాలీవుడ్‌లో కాంట్రవర్సీగా మారిన శివాజీ (Sivaji) వ్యాఖ్యలపై ఆయన మరోసారి యూట్యూబ్ ఛానళ్ల ఇంటర్వ్యూలలో హైలెట్ అవుతున్నారు. శివాజీ తరపున మాట్లాడుతూ.. చిన్మయి (Chinmayi)కి తోపు పాయింట్‌తో షాకిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- Sivaji: వ్యక్తిగత విషయాలు వదిలేసి ‘దండోరా’ను హిట్ చేయండి.. లేదంటే నేనే నింద మోయాలి!
చిన్మయి పాడిన రోబో పాటపై కాంట్రవర్సీ
ఈ వీడియోలో.. ‘‘కిళిమాంజారో భళ భళిమాంజారో కథకళిమాంజారో యారో యారో… అనే పాటలో ఇంకాస్త ముందుకు వెళితే.. ‘నా సోకు పళ్లే తిని వెన్ను పట్టి ఆరబెట్టే హనీ’ అని ఉంటుంది. ఈ పాటను పాడిందెవరు? చిన్మయి. ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. ఉమెన్‌ని ఐటమ్ వైజ్‌గా చూడకూడదు. ఉమెన్‌లో ఉన్న బాడీ పార్ట్స్‌ను ఒక్కో పార్ట్‌ని ఒక్కో ఐటమ్‌తో పోల్చడం అబ్జెక్టిఫైయింగ్ అనేది వాళ్ల ప్రధాన ఆరోపణ. మరి ఈ పాటను ఆమె నెత్తిమీద గన్ పెట్టి పాడించారా? డబ్బులు తీసుకుని పాడిందా? డబ్బులిస్తే ఎంతకైనా దిగజారతారా? మీరు చేసే పనులేంటి? యూత్‌ని ఆకర్షించడానికి కాకపోతే.. దేనికోసం ఈ లైన్స్. వెధవల్ని ఆకర్షించడం కోసం నువ్వు పాటలు పాడుతున్నావు. వెధవల్ని ఆకర్షించడం కోసం నువ్వు బూతులు మాట్లాడుతున్నావు. వెధవల్ని ఆకర్షించడం కోసం చిన్న చిన్న బట్టలు వేసుకుని కనబడతావ్. ఈ వెధవల్ని తయారు చేస్తుందే మీరు’’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరి దీనిపై చిన్మయి కూడా రియాక్టైంది.
Also Read- Shambhala: ఆది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘శంబాల’.. ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ వదిలారు
శివాజీ ఆ సీన్ ఎందుకు చేశాడు..
వైరల్ అవుతున్న శేఖర్ బాషా వీడియోతో పాటు, శివాజీ యాక్ట్ చేసిన ఓ సినిమాలోని క్లిప్‌ని పెట్టి.. వివరణ ఇస్తున్న ఓ వ్యక్తి వీడియోను షేర్ చేసిన చిన్మయి.. ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పారు. ‘అవగాహన కల్పించడానికి ఒక మనస్తత్వవేత్త లేదంటే విద్యావంతుడైన వ్యక్తి అవసరం. అతనిలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు’ అని పోస్ట్ చేసిన చిన్మయి పోస్ట్‌లో.. శేఖర్ బాషాకు కౌంటర్ ఇచ్చాడో వ్యక్తి. ఆ వీడియోలో శివాజీ బస్సులో వెళుతున్నప్పుడు ఓ ఆంటీ నడుము గిల్లి.. నాకు తెలియదని బుకాయిస్తుంటాయి. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి.. చిన్మయి ఆ పాట ఎందుకు పాడిందని అడిగే శేఖర్ బాషా.. మరి శివాజీ ఈ సీన్ ఎందుకు ఒప్పుకున్నాడో కూడా చెప్పాలి కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా అయితే, కౌంటర్, ప్రతి కౌంటర్‌లతో ఈ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
It takes a psychologist and an educated man to create awareness 🙂
Thank God for men like him 🙏🙏🙏 pic.twitter.com/8SKAa5irYd
— Chinmayi Sripaada (@Chinmayi) December 26, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

