Shambhala: ‘శంబాల’ డే వన్ కలెక్షన్స్ పోస్టర్ వదిలారు.. ఎంతంటే?
Shambhala (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Shambhala: ఆది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘శంబాల’.. ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ వదిలారు

Shambhala: వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) కెరీర్‌లోనే ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘శంబాల’ (Shambhala) నిలిచినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, అంతకు ముందు పడిన ప్రీమియర్స్‌తోనే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఆ పాజిటివ్ మౌత్ టాక్‌తో షోలు, స్క్రీన్‌లు పెరుగుతున్నట్లుగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రిస్మస్ సీజన్‌ను ‘శంబాల’ అద్భుతంగా వాడుకుంటోందని, ప్రీమియర్ల నుంచి మొదలైన పాజిటివ్ టాక్.. డే వన్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపించి.. విడుదలైన అన్ని చోట్ల హౌస్‌ ఫుల్ బోర్డులు పడుతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఈ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్ర మొదటి రోజు కలెక్షన్ల వివరాలు తెలుపుతూ, అధికారికంగా మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. పాజిటివ్ టాక్, కలెక్షన్లలో వస్తున్న పెరుగుదల చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతోన్నాయని, లిమిటెడ్ స్క్రీన్లలో రిలీజ్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఫుల్ డిమాండ్‌తో దూసుకుపోతోందని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.

Also Read- Sivaji: వ్యక్తిగత విషయాలు వదిలేసి ‘దండోరా’ను హిట్ చేయండి.. లేదంటే నేనే నింద మోయాలి!

డే వన్ కలెక్షన్స్ పోస్టర్..

‘శంబాల’ మూవీ విడుదలైన అన్నిచోట్ల మంచి ఆక్యుపెన్సీతో దూసుకుపోతూ డే వన్ ప్రపంచవ్యాప్తంగా 3.3 కోట్ల గ్రాస్‌ను (Shambhala Day 1 Collections) వసూలు చేసినట్లుగా ఈ పోస్టర్‌లో ప్రకటించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మొదటి పోస్టర్ విడుదలైనప్పటి నుంచి మంచి అంచనాలనే ఏర్పరచుకుని, అదే హైప్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కంటెంట్ మీదున్న నమ్మకంతో రిలీజ్‌కు రెండ్రోజుల ముందు నుంచే ప్రీమియర్లు వేస్తూ వచ్చారు. అలా వేసిన ప్రతి ప్రీమియర్‌కు పాజిటివ్ టాక్ రావడం, డే వన్‌కి అది మరింతగా పెరగడంతో అన్ని చోట్లా షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. పైగా సినిమాకు డిమాండ్ పెరగడంతో అన్ని ఏరియాల్లోనూ షోలు, స్క్రీన్‌లను పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. నగరాల్లోని మల్టీప్లెక్స్‌లు మాత్రమే కాకుండా చిన్న చిన్న సెంటర్లలోని సింగిల్ స్క్రీన్లలో సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడుతుండటంతో చిత్రయూనిట్ చాలా హ్యాపీగా ఉంది.

Also Read- Duvvada Couple: శివాజీ మాటల రచ్చలోకి ‘దువ్వాడ’ జంట.. సపోర్ట్ ఎవరికంటే?

కష్టానికి తగిన ప్రతిఫలం

సినిమా విడుదలైన రెండో రోజు నుంచే అన్ని చోట్లా స్క్రీన్లను పెంచేసినట్లుగా నిర్మాతలు తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, రానున్న రోజుల్లో ‘శంబాల’ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం విశ్లేషిస్తున్నాయి. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయని, విమర్శకులు కూడా తమ రివ్యూలలో చెబుతున్నారు. ఆది సాయి కుమార్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోందని ఆడియెన్స్ ఇస్తున్న రివ్యూలు కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ క్రిస్మస్ సీజన్‌లోని లాంగ్ రన్‌ వాడుకుంటూ ‘శంబాల’ అనేక రికార్డుల్ని బద్దలు కొట్టడం కాయమని మేకర్స్ తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా చాలా గ్యాప్ తర్వాత తన కుమారుడికి సాలిడ్ హిట్ పడటంతో సాయి కుమార్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!

Indian Railways: రైల్వేస్ కీలక నిర్ణయం… ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్!

Chamala Kiran Kumar Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా.. ఎంపీ చామల కేటీఆర్‌కు సవాల్!

Jana Nayagan: మరో పాట వదిలారు.. నో డౌట్ ‘భగవంత్ కేసరి’ రీమేకే!

Amith Shah: ఢిల్లీ పేలుడు ఘటనపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు