Students Boycott Classes: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రిన్సిపాల్ మురళీకృష్ణ వేధింపులకు వ్యతిరేకంగా ఎంఎస్ఎంఈ కాలేజీ (MSME College) స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. అర్థరాత్రి విద్యార్థినుల వసతి గృహాల్లోకి వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, డీజీఎం ప్రసాద్ రెడ్డిలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తరగతులను బహిష్కరించారు.
ప్రిన్సిపల్ వేధింపులు, బెదిరింపులకు వ్యతిరేకంగా గత శనివారమే (డిసెంబర్ 20) కళాశాల ఆవరణలో ధర్నా చేసినట్లు బాధిత విద్యార్థులు తెలిపారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొని ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ నుంచి తమకు ఎదురైన ఛేదు అనుభవాలను ఆరోజు చెప్పుకొని బాధపడ్డారని పేర్కొన్నారు. అయితే ధర్నా రోజున ఎవరైతే ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా మాట్లాడారో.. వారికి సస్పెండ్ నోటీసులు జారీ అయినట్లు విద్యార్థులు ఆరోపించారు.
ప్రిన్సిపాల్ వేధింపులు.. తరగతులు బహిష్కరించిన విద్యార్థులు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రిన్సిపాల్ మురళీకృష్ణ వేధింపులకు వ్యతిరేకంగా ఎంఎస్ఎంఈ కాలేజీ స్టూడెంట్స్ ఆందోళన
అర్థరాత్రి విద్యార్థినుల వసతి గృహాల్లోకి వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపణ
ఇదేంటని ప్రశ్నించిన… pic.twitter.com/ovbm6TYvkj
— BIG TV Breaking News (@bigtvtelugu) December 26, 2025
Also Read: Psycho Hulchul: తిరుమలలో సైకో హల్‌చల్.. చిన్నారుల వెంటపడుతూ.. చంపేస్తానని బెదిరింపులు
ఆ రోజు తమకు అండగా వచ్చేందుకు యత్నించిన విద్యార్థి సంఘం నేతలను సైతం పోలీసులను అడ్డుపెట్టుకొని బెదిరించారని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గత శనివారం ధర్నా సందర్భంగా కాలేజీ యాజమాన్యం వచ్చి ఇకపై మీకు ఎలాంటి సమస్యలు ఉండవని హామీ ఇచ్చిందని చెప్పారు. దీంతో అది నిజమని భావించి.. ఆందోళనలను విరమించినట్లు పేర్కొన్నారు. తీరా ఆ మర్నాడే ఉదయం 10 గంటలకు ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా మాట్లాడిన ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు రివర్స్ లో తమపై బెదిరింపులకు దిగుతున్నారని విద్యార్థులు వాపోయారు. తమ సస్పెన్షన్ తొలగించే వరకూ ఈ ధర్నా ఇలాగే కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

