Psycho Hulchul: దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో తిరుమల ఒకటి. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. స్వామివారికి మెుక్కులు చెల్లించుకొని పునీతులు అవుతుంటారు. అలాంటి తిరుమలలో ఓ సైకో హల్ చల్ సృష్టించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చేతిలో కత్తి పెట్టుకొని చిన్నారుల వెంట పడుతుండటంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పిల్లలను చంపేస్తానంటూ..
భక్తులతో నిత్యం రద్దీగా ఉండే శ్రీవారి ఆలయం సమీపంలో ఈ సైకో అలజడి సృష్టించినట్లు తెలుస్తోంది. కళ్లముందు ముగ్గురు చిన్నారులు వెళ్తుండగా కత్తితో వారి వెంటపడినట్లు భక్తులు చెబుతున్నారు. పెద్దగా అరుస్తూ చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. నిందితుడి చేతిలో కత్తి చూసి తొలుత భయపడిన కొందరు భక్తులు.. ఎట్టకేలకు ధైర్యం చేసి అతడ్ని పట్టుకున్నారు.
తిరుమలలో సైకో హల్‌చల్.. చిన్న పిల్లల వెంటపడుతూ చంపేస్తానని కత్తితో బెదిరింపులు
సైకోను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిగా గుర్తింపు pic.twitter.com/NThCyBCxQ1
— ChotaNews App (@ChotaNewsApp) December 26, 2025
బెంగాల్ వాసిగా గుర్తింపు..
సైకో హల్ చల్ కు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులకు భక్తులు చేరవేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మీది ఏ ప్రాంతమని పోలీసు ప్రశ్నించగా.. పశ్చిమ బెంగాల్ అంటూ అతడు సమాధానం ఇచ్చాడు. దీంతో అతడ్ని పోలీసు జీపులో ఎక్కించుకొని స్టేషన్ కు తరలించారు. అయితే నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు తెలుస్తోంది. అందుకే కత్తి పట్టుకొని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు అనుమానిస్తున్నారు.
Also Read: CM Chandrababu: రప్పా రప్పా చేస్తారా.. బాబాయ్‌ని లేపేసి నింద వేస్తారా.. సీఎం చంద్రబాబు వైల్డ్ ఫైర్
పిల్లలు జాగ్రత్త..
కాగా, నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే తిరుమలలో పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులదేనని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మాడ విధులు, క్యూలైన్లు, మెట్ల మార్గం ఇలా ఎక్కడా ఉన్న సరే పిల్లలను ఓ కంట కనిపెట్టుకొని ఉండాలని సూచిస్తున్నారు. పిల్లలను అపహరించే బ్యాచ్.. అదును కోసం ఎప్పుడూ ఎదురు చూస్తు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలను ఒంటరిగా ఎక్కడికి పంపకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

