CM Chandrababu: రప్పా రప్పా చేస్తారా.. సీఎం చంద్రబాబు వైల్డ్ ఫైర్
CM Chandrababu (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: రప్పా రప్పా చేస్తారా.. బాబాయ్‌ని లేపేసి నింద వేస్తారా.. సీఎం చంద్రబాబు వైల్డ్ ఫైర్

CM Chandrababu: రాజకీయ ముసుగులో ఉండి నేరాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులకు పూర్తి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచించారు. అప్పుడే పోలీసులు అందించే సేవల పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుందని అన్నారు. మరోవైపు విపక్ష వైసీపీ రెచ్చగొట్టే వ్యవహరశైలిపైనా సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

‘రాష్ట్ర బహిష్కరణ చేస్తాం’

సమాజం హితం లేని, రాజ్యాంగపరం కానీ చట్టవిరుద్దమైన చర్యలూ ఎప్పుడూ ఆమోదయోగ్యం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. అక్రమాలకు పాల్పడితే టీడీపీ వారైనా కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. 2019-24 మధ్య పాలకులు శాంతిభద్రతలు భ్రష్టు పట్టించారని సీఎం మండిపడ్డారు. తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని విమర్శించారు. తాము ఎప్పుడు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా శాంతిభద్రతల్ని చేతుల్లోకి తీసుకోలేదని చంద్రబాబు గుర్తుచేశారు. హత్యారాజకీయాలను ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.

భయబ్రాంతులకు గురిచేస్తారా?

గత ప్రభుత్వ హయాంలో చేసిన విధంగానే ఇప్పుడు కూడా కొందరు అదే రౌడీయిజాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘రోడ్లు బ్లాక్ చేయటం, రప్పా రప్పా లాడించటం ఏమిటో ఎవరికీ ఆర్ధం కావటం లేదు. పోస్టర్ల వద్ద కత్తులతో జంతు బలి చేసి ఫ్లెక్సీలపై రక్తం చల్లి సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేస్తారా? వివేకా హత్యకేసులో నేరం చేసిన వ్యక్తులు దానిని ఇతరుల పైకి వేసేందుకు ప్రయత్నించారు. నేరస్తులు ఎన్ని డ్రామాలు ఆడినా ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. నేరస్తుల కంటే పోలీసులు తెలివిగా వ్యవహరించాలి’ అని చంద్రబాబు సూచించారు.

Also Read: KTR on CM Revanth: మా అయ్య మెుగోడు.. తెలంగాణ తెచ్చినోడు.. సీఎంకు కేటీఆర్ కౌంటర్

‘ప్రభుత్వంపై బురద చల్లితే ఊరుకోం’

‘బంగారు పాళ్యంలో మామిడి కాయలు తొక్కించారు. గుంటూరులో ఓ వ్యక్తిని కాన్వాయ్ కింద తొక్కించేసి పొదల్లో పారేసి పోయారు. అంబులెన్సులో తీసుకెళ్లి చంపేశారని వారి బంధువులతో చెప్పించారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోం. సామాజిక మాధ్యమాలలో ఇంకా అసభ్య పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎన్డీఏ భాగస్యామ్యంలో ఉన్న వారెవరూ ఈ తరహా లో వ్యవహరించటం లేదు. రాజకీయ ముసుగులో ఉండి నేరాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం. పోలీసు వ్యవస్థ గట్టిగా ఉండాలి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా చిన్న ఘటన కూడా జరగడానికి వీల్లేదు. టెక్నాలజీని సమర్ధంగా వాడుకుని నేర నియంత్రణ చేయాలి’ అని చంద్రబాబు సూచించారు.

Also Read: Phone Tapping Case: నా ఫోన్లు ట్యాప్ చేశారు.. సిట్‌కు మెుత్తం చెప్పేసా.. సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్

Just In

01

Accreditation Guidelines: జర్నలిస్టులకు అక్రెడిటేషన్ మార్గదర్శకాలపై మీడియా అకాడమీ చైర్మన్ స్పందన

Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టు పార్టీ లేకపోతే చట్టాలు, హక్కులు ఉండేవి కాదు : సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు!

GHMC: జీహెచ్ఎంసీలో మరోసారి అంతర్గత మార్పులు.. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఛాన్స్?

Brave boy Sravan: ఆపరేషన్ సింధూర్‌లో సైనికులకు సాయం.. 10 ఏళ్ల బాలుడికి ప్రతిష్టాత్మక కేంద్ర పురస్కారం

Medaram Temple: ప్రతి చిహ్నానికి ఆదివాసీ చరిత్రే ఆధారం.. నమస్తే తెలంగాణ కథనంపై ఆదివాసి సంఘాల ఆగ్రహం!