Anasuya Viral Post: స్విమ్ సూట్‌ వీడియోతో ట్రోలర్స్‌కు షాక్..
anasuya-viral-post(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Anasuya Viral Post: మిస్ అవుతున్నా.. స్విమ్ సూట్‌ వీడియో పెట్టి మరీ ట్రోలర్స్‌కు షాకిచ్చిన అనసూయ

Anasuya Viral Post: టాలీవుడ్‌లో వివాదాలు కొత్తేమీ కాకపోయినా, గత కొన్ని రోజులుగా నటుడు శివాజీ, పాపులర్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మధ్య సాగుతున్న పరోక్ష యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్న తరుణంలో, అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. ఇటీవల దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు అప్పుడు దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిని ఖండిస్తూ సింగర్ చిన్మయి శివాజీపై సీరియస్ అయ్యారు. ఇదే విషయంపై అనసూయ కూడా ఘాటుగానే స్పందించారు. దీంతో ఈ వివాదం మరింత రేగింది. ప్రస్తుతం అనసూయ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.  ఈ వీడియో తనను ట్రల్ చేసేవారికి సమాధానం గా భావిస్తున్నారు. దీనిని చూస్తుంటే అనసూయను ట్రోల్ చేసేవారు చేసుకోండి నేను ఇలానే ఉంటాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ తెలుపుతున్నట్లుల ఈ వీడియో ఉంది.

Read also-Bigg Boss9: ‘ఇమ్మూన్యుల్ ఒక వెదవ.. ఎంత చెప్పినా వినలేదు’.. తనూజ షాకింగ్ కామెంట్స్

వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్

ఈ గొడవలు ఇలా కొనసాగుతుండగానే, అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె నీటి అలల మధ్య ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఆ వీడియోకు ఆమె జత చేసిన క్యాప్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నేను నీటి దగ్గర ఉన్నప్పుడు అత్యంత సంతోషంగా ఉంటాను. నా ప్రయాణ రోజులను ఎంతో మిస్ అవుతున్నాను. త్వరలోనే మరో పర్యటనకు ప్లాన్ చేయాలి అంటూ రాసుకొచ్చారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత ఫోటోలు షేర్ చేయడం సహజమే. కానీ, శివాజీతో వివాదం నడుస్తున్న సమయంలో అనసూయ స్విమ్ సూట్ లో హాట్ గా కనిపించడం మరింత చర్చకు దారి తీస్తుంది. మహిళలు తమకు ఇష్టమొచ్చినట్లు ఉండటంలో కావాల్సిన దుస్తులు వేసుకోవడంలో స్వాతంత్ర్యం ఉంటుందని ఈ వీడియో ద్వారా ఆమె చెప్పకనే చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తోంది. ఒకవైపు శివాజీ మద్దతుదారులు ఆమెను విమర్శిస్తుంటే, మరోవైపు అనసూయ ఫ్యాన్స్ ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి, ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.

Read also-Sanjana Journey: గౌరవం కోసమే బిగ్ బాస్9లో టాప్ 5 వరకూ వచ్చానంటున్న సంజన.. ఆ నింద ఏంటంటే?

యాక్టర్ శివాజీ ఆడవారిపై సంచలన వ్యాఖ్యలు చేసి మరో సారి వార్తల్లో నిలిచారు. ‘దండోర’ సినిమా డిసెంబర్ 25, 2025న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ ఆడవారి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ తనదైన శైలిలో మాట్లాడే శివాజీ ఇప్పుడు కూడా ఆడవారు గురించి, వారు వేసుకునే బట్టలు గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘అమ్మాయిలు హీరోయిన్లు మీరు కనబడేలా బట్టలు వేసుకుని పోతే మనమే నిందలు అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఏం అనుకోవద్దు మంచిగా చీర కట్టుకని రండి, ఎంతో అందంగా ఉంటుంది. మీ అందం నిండుగా చీరకట్టుకునే బట్టల్లో ఉంటుంది తప్పితే సామన్లు కనబడే దాంట్లో ఏం ఉండదు. మీ ముందు చాలా మాట్లాడతారు. చాలా బావున్నావు అంటారు, నువ్వు వెళ్లి పోయిన తర్వాత అంటారు ఇలాంటి బట్టలు వేసుకుంది కొంచెం మంచి బట్టుల వేసుకోవచ్చుకదా.. బావుంటావు కదా అంటూ మాట్లాడుకుంటారు. అంటూ చెప్పుకొచ్చారు. చాలా మందికి అలా అనాలనిపిస్తుందని కానీ అనలేమని, ఎందుకంటే స్త్రీ స్వతంత్రం స్వేచ్ఛ అంటారు అని చమత్కరించారు.

">

Just In

01

Gadwal District: ఆ జిల్లాల్లో 11శాతం తగ్గిన క్రైమ్ రేట్.. సైబర్ నేరాల నియంత్రణపై పోలీస్‌ల ప్రత్యేక దృష్టి!

Students Boycott Classes: ప్రిన్సిపాల్ వేధింపులు.. అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి దూరి.. విద్యార్థినులతో అసభ్యంగా..

Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీకి అత్యున్నత అవార్డ్.. అందజేసిన రాష్ట్రపతి ముర్ము

Amaravathiki Ahwanam: ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’.. న్యూ పోస్టర్ చూశారా!

Telangana Corruption: అవినీతి కేసుల్లో తెలంగాణ రికార్డ్.. ప్రభుత్వ కార్యాలయాలే లంచాల అడ్డాలా?