Bigg Boss9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. ఆ రియాలిటీ షో అయిపోయాకా అటు స్నేహితులను, ఇటు ప్రేక్షకులను సభ్యులు చాలా మిస్ అవుతున్నారు. వీడియో కాల్స్ ద్వారా ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే వినోదం, గొడవలు, అంతకుమించి ఎమోషన్స్. సీజన్ 9లో కంటెస్టెంట్‌గా అలరించిన తనూజ, హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తన తోటి కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ (ఇమ్ము) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, తనూజ క్లారిటీ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read also-Allu Arjun: అల్లు అర్జున్ ఈ లైనప్ చూస్తే ప్యాన్స్ ఫ్యాన్స్‌కు పండగే.. గ్లోబల్ రేంజ్ ర్యాంపేజ్..
అల్లరి వెనుక ఉన్న అసలు కథ!
ఇంటర్వ్యూలో తనూజ మాట్లాడుతూ, హౌస్‌లో తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఇమ్మాన్యుయేల్ అని స్పష్టం చేసింది. “ఇమ్ము ఈజ్ మై ఫేవరెట్” అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. తనూజలోని అసలైన అల్లరిని, ఆ నాటీనెస్ (Naughtiness) ని బయటకు తీసింది ఇమ్మాన్యుయేల్ అని ఆమె చెప్పుకొచ్చింది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ ఇమ్ము తోడుగా ఉన్నప్పుడు తాను చాలా ఉత్సాహంగా, ఫన్ చేస్తూ గడిపానని ఆమె గుర్తు చేసుకుంది.
మా బాండింగ్ ప్రత్యేకమన్న తనూజ
ఒకే ఇంట్లో ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజం. తనూజ ఇమ్ముల మధ్య కూడా కొన్ని మిస్అండర్‌స్టాండింగ్స్ వచ్చాయని ఆమె ఒప్పుకుంది. “మేము తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, కొన్ని సందర్భాల్లో ఏడ్చాం కూడా.. కానీ అవన్నీ ఆ క్షణానికే పరిమితం” అని ఆమె వివరించింది. ఆ గొడవలు ముగిసిన వెంటనే మళ్ళీ సాధారణంగా కలిసిపోయేవాళ్లమని, వారి మధ్య ఉన్నది స్వచ్ఛమైన స్నేహమని ఆమె మాటల్లో స్పష్టమైంది. బిగ్ బాస్ హౌస్‌లో వీరిద్దరి ప్రయాణం ఒక రకంగా టామ్ అండ్ జెర్రీ ఆటలా సాగింది. ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవడం, గొడవ పడటం, మళ్ళీ కలిసిపోవడం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. ముఖ్యంగా కళ్యాణ్ పడాల మరియు ఇమ్మాన్యుయేల్ ఇద్దరితోనూ తనూజకు మంచి అనుబంధం ఉంది. అయితే ఇమ్ము గురించి మాట్లాడుతూ, అతనితో ఉన్న కనెక్షన్ తనను హౌస్‌లో మానసికంగా దృఢంగా ఉంచిందని ఆమె అభిప్రాయపడింది.
Read also-Shambhala: ‘శంబాల’ సక్సెస్.. పుత్రోత్సాహంతో సాయి కుమార్ ఎమోషనల్..
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తనూజ, హౌస్‌లో గడిపిన ప్రతి క్షణాన్ని మిస్ అవుతున్నట్లు తెలిపింది. బయట తనపై వచ్చే నెగిటివిటీని తాను పట్టించుకోనని, తనను ప్రేమించే అభిమానులు ఉన్నంత కాలం తానూ సంతోషంగా ఉంటానని చెప్పింది. ఇమ్మాన్యుయేల్ వంటి మంచి స్నేహితుడు దొరకడం తన అదృష్టమని, ఆ బంధం హౌస్ బయట కూడా కొనసాగుతుందని తనూజ ఆశాభావం వ్యక్తం చేసింది.

