Duvvada Couple: ‘దండోరా’ ప్రీ రిలీజ్ వేడుక (Dhandoraa Pre Release Event)లో శివాజీ (Sivaji) మాట్లాడిన మాటలపై ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. స్పెషల్‌గా వీడియో విడుదల చేసి ఒకసారి, మీడియా సమావేశం నిర్వహించి మరోసారి క్షమాపణలు చెప్పినా.. ఈ వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. నిధి అగర్వాల్ విషయంలో జరిగింది తన మైండ్‌లో ఉండటం వల్లే.. అలా మాట్లాడాను. అందులో రెండు మాటలు అనకూడనవి అన్నాను.. కాబట్టి అందరినీ క్షమాపణలు కోరుతున్నానని శివాజీ అన్నారు. అయితే ఆ వేదికపై పద్ధతిగా డ్రస్ వేసుకోమని చెప్పిన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడి ఉన్నానని శివాజీ అనడంతో.. పూర్తి స్థాయిలో ఆయన క్షమాపణలు చెప్పలేదని.. అనసూయ, చిన్మయి వంటి వారు సోషల్ మీడియా వేదికగా పదే పదే ఈ అంశంపై రియాక్ట్ అవుతూనే ఉన్నారు. అలా ఈ వివాదం ఇప్పుడో సమస్యగా మారింది.
Also Read- Shivaji Controversy: శివాజీ వ్యాఖ్యల దుమారంలో మాజీ సర్పంచ్ నవ్య ఎంట్రీ.. సెన్సేషనల్ వ్యాఖ్యలు
శివాజీ సపోర్టర్స్ పెరుగుతున్నారు
ఇక ఈ వివాదంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కరాటే కళ్యాణి మీడియా ఛానల్స్ నిర్వహించే డిటెట్స్‌లో పాల్గొంటూ.. శివాజీ పలికిన ఆ రెండు పదాలు మినహా, అతను చెప్పిన దానిలో తప్పేం లేదని కుండబద్దలు కొట్టేశారు. ఈ విషయంలో ఆమె అనసూయపై చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇంట్లో అనసూయ చాలా పద్దతిగా చీర కట్టుకుని గృహప్రవేశం ఎందుకు చేసింది అంటూ కౌంటర్స్ వేశారు. దీనికి హర్టయిన అనసూయ కళ్యాణికి నోటీసులు పంపించి షాకిచ్చారు. అలా ఈ వివాదంపై శివాజీ సపోర్టర్స్ సోషల్ మీడియాలో బాగా పెరిగిపోతున్నారు. అలా ఈ వివాదంలోకి తాజాగా దువ్వాడ కపుల్స్ కూడా ఎంటరై.. తమ వాయిస్ వినిపించారు. దీంతో ఈ కాంట్రవర్సీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకీ దువ్వాడ కపుల్ (Duvvada Couple) ఎవరికి సపోర్ట్ చేశారో తెలుసా?
Also Read- Vilaya Thandavam: యాక్షన్ మోడ్‌లో కార్తీక్ రాజు.. ‘విలయ తాండవం’ లుక్ అదిరింది
ఉద్దేశం మంచిదే.. మాట్లాడిన విధానమే తప్పు!
దువ్వాడ కపుల్.. శివాజీకే సపోర్ట్‌గా మాట్లాడారు. దివ్వెల మాధురి ఇటీవల బిగ్ బాస్‌కి వెళ్లినప్పటికీ, అందులో కూడా మ్యాగ్జిమమ్ నిండైన చీరకట్టులోనే కనిపించారు. ఆమె బయట ఎక్కడ కనిపించినా కూడా నిండైన చీరకట్టులోనే కనిపిస్తారు తప్పితే.. ఎప్పుడూ హద్దులు దాటలేదు. అందుకే శివాజీ మాటల్లో తప్పులేదని, ఆయన ఉద్దేశం మంచిదే కానీ, ఆ రెండు మాటలు అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆయన ఉద్దేశం మంచిదే కానీ, మాట్లాడిన విధానమే తప్పని, సామాన్లు.. వగైరా అనకుండా ఉండాల్సిందని అన్నారు. అలాగే, ఆయన ఉద్దేశాన్ని బహిరంగ వేడుకపై కాకుండా, పర్సనల్‌గా చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అలాంటి డ్రస్సులు ఇవ్వకుండా ఉండేలా చూడాలని సరికొత్త పాయింట్‌ని వారు లేవనెత్తారు. మన ఇంట్లో మన చెల్లి, భార్య ఎవరైనా డ్రెస్ సరిగా వేసుకోకపోతే మనం ఎలా అయితే వాళ్లకు చెబుతామో అలాగే శివాజీ చెప్పాడని అన్నారు దువ్వాడ శ్రీనివాస్. కాకపోతే ఆయన చెప్పిన విధానం తప్పని ఆయన కూడా అన్నారు. ఇప్పుడీ కపుల్స్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

