Defected MLAs | బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. బీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌లపై వివరణ కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ శాసనసభ కార్యదర్శి నోటీసుల్లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు పంపించారు. అయితే, న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత స్పందిస్తామని, అందుకోసం కొంత సమయం ఇవ్వాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలు కోరినట్లు తెలుస్తోంది.
Also Read : MLC Kavitha | బీఆర్ఎస్‌లో బీసీ రగడ.. ‘అన్నకు షాక్ ఇచ్చిన చెల్లి’
కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defected MLAs)పై అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై నిన్న (సోమవారం) విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఈ పిటిషన్ పై ఎంత సమయం తీసుకుంటారు? నిర్ణయమేంటో త్వరగా తేల్చాలని అసెంబ్లీ సెక్రెటరీకి నోటీసులు జారీ చేసింది.