KTR: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గొంతుకోసి, సొంత జిల్లాకే దగా చేస్తున్న రేవంత్ రెడ్డి, తన నిర్వాకం బయటపడటంతో తట్టుకోలేక అరుస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బుధవారం ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. రాష్ట్ర జల హక్కులను కాపాడటం చేతగాదని విమర్శలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గొంతుకోసి, సొంత జిల్లాకే దగా చేస్తున్న రని ధ్వజమెత్తారు. నీటి హక్కులపై రాజీపడ్డ విషయాన్ని బయటపెడితే సమాధానం చెప్పలేక చిల్లర డైలాగులతో చిందులు తొక్కడం రేవంత్ నైజమని విమర్శించారు.
Also Read: KTR: ‘సీఎం రేవంత్‌ను ఫుట్ బాల్ ఆడుకుంటా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
జలద్రోహాన్ని ఎండగడతాం
రాబోయే శాసనసభలోనూ, జనసభలోనూ ప్రతిచోటా కాంగ్రెస్ చేస్తున్న జలద్రోహాన్ని ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, పౌరుషం గల బిడ్డలుగా ప్రశ్నిస్తామని పునరుద్ఘాటించారు. తాము ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదని, రైతన్నల హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతామని హెచ్చరించారు. తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు ఆడుతూ ప్రజలను తమాషా పట్టించడం ప్రతిసారి సాగదని, జనం అన్నీ గమనిస్తున్నారని ఆయన తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తొక్కి నారతీస్తారని, 2028 ఎన్నికల్లో ఆ పార్టీని బొంద పెట్టడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. మరో వందేళ్ల దాకా పుట్టగతులు లేకుండా కాంగ్రెస్‌ను పాతిపెట్టడం తథ్యమని ఆయన హెచ్చరించారు. ఎన్ని బూతులు తిట్టినా, ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ తన పోరాటాన్ని ఆపబోదని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: KTR: పంచాయతీ నిధులు, ఇందిరమ్మ ఇండ్లు మీ అబ్బ సొత్తు కాదు: కేటీఆర్

