Chinmayi Sripada: ఏ నిమిషాన యాక్టర్ శివాజీ (Actor Sivaji) నోరు జారాడోగానీ.. అంతా ముప్పెట దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళా నటీమణులు శివాజీని టార్గెట్ చేస్తూ, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తను మాట్లాడిన మాటల్లో రెండు పదాలు తప్పుగా దొర్లాయని, అందుకు సారీ అంటూ వీడియో విడుదల చేసిన శివాజీ, బుధవారం మీడియా సమావేశం నిర్వహించి మరీ, మరోసారి క్షమాపణలు కోరాడు. అయితే, ఆ రెండు పదాలకే క్షమాపణలు చెబుతున్నాను తప్పితే.. మిగతా నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌పైనే నిలబడుతున్నానని కుండబద్దలు కొట్టేశాడు. సారీ చెప్పాడు కదా.. ఇక ఈ వివాదం ముగుస్తుందిలే అని అంతా అనుకున్నారు. కానీ శివాజీ, ఆ స్టేట్‌మెంట్‌పైనే ఉంటానని చెప్పడంతో, మరోసారి ఆయనపై మహిళామణులు తమ ప్రతాపం చూపిస్తున్నారు.
Also Read- Anasuya: అతనిది చేతగానితనం.. శివాజీకి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్
మీ కొడుకులకు కూడా చీరలు కట్టండి
ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా శివాజీకి కౌంటర్ ఇచ్చిన సింగర్ చిన్మయి (Chinmayi Sripada), ఆయన మీడియా సమావేశం అనంతరం మరోసారి ఇచ్చిపడేసింది. ముఖ్యంగా మీడియా సమావేశంలో జయసుధ, విజయశాంతి వంటి వారు చీరలు కట్టుకుని కనిపించేవారని, వారి పేరుతో శారీలు కూడా అమ్మేవారని ఆయన కామెంట్స్ చేశారు. ఇదే విషయంపై శివాజీకి ఆమె మరోసారి కౌంటర్ ఇచ్చారు. ‘చీరలు కట్టుకుంటే అత్యాచారాలు ఆగుతాయా? అలా అయితే మీ కొడుకులకు కూడా చీరలు కట్టండి..’ అంటూ ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సమాజం ఏ విధంగా మారిందో తెలియంది కాదు. చీరలు కట్టుకున్నా, కట్టుకోకపోయినా, ఆడది కనిపిస్తే చాలు మగాళ్ల మైండ్ సెట్ ఎలా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సమాజంలో ఉంటూ, ఎవరు, ఎన్ని నీతులు చెప్పినా.. జరిగేవి జరుగుతూనే ఉంటాయి. వీటిని ఆపడానికి అనసూయ, చిన్మయి వంటి వారు ఎందరూ వచ్చినా ఆపలేరు.
Also Read- Nidhhi Agerwal: శివాజీ కామెంట్స్‌పై నిధి షాకింగ్ పోస్ట్.. మళ్లీ బుక్కయ్యాడుగా!
శివాజీ తగ్గితే బెటర్
అలాగే శివాజీ కామెంట్స్ కూడా అర్థం పర్థం లేనివి. ఒకరి డ్రస్సు గురించి కామెంట్ చేయడానికి ఆయనకు కూడా హక్కు లేదు. ఎవరి ఇష్టం వారిది? పదిమందిలో ఇబ్బంది పడేది వారు. కష్టం, నష్టం వారే చూసుకుంటారు. ఆపై ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్స్, న్యాయ స్థానాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి, ఈ విషయంలో శివాజీ తన స్టేట్‌మెంట్‌ని కూడా వెనక్కి తీసుకుని, కామ్‌గా తన పని తాను చేసుకుంటే బెటర్. అలా కాదంటే, మరింతగా ఆయనపై దాడి జరిగే అవకాశం ఉంది. తద్వారా ఆయన ఫ్యామిలీ కూడా చిక్కుల్లో పడొచ్చు. ఈ తలనొప్పి అంతా ఎందుకు అనుకుంటే, వెంటనే ఆ స్టేట్‌మెంట్‌ని వెనక్కి తీసుకుని, ఎవరి సావు వారిని సావనిస్తే బెటర్ అని అనుకుంటే సరిపోతుంది. మరి శివాజీ మూవ్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే చిన్మయి వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

