Razor Title Glimpse: రవిబాబు కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ చూశారా?..
razor-glimps(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Razor Title Glimpse: రవిబాబు కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ చూశారా?.. ఏంటి భయ్యా మరీ ఇంత బ్రూటల్‌గా ఉంది..

Razor Title Glimpse: వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రవిబాబు, మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేశారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘రేజర్’ (Razor) కు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యింది. ఈ గ్లింప్స్ ప్రారంభంలోనే ‘WARNING 18+’ అనే హెచ్చరికను జారీ చేశారు. గుండె బలహీనంగా ఉన్నవారు ఈ వీడియోను చూడకూడదని చిత్ర బృందం స్పష్టంగా సూచించింది. దీనిని బట్టే ఈ సినిమా ఎంత తీవ్రమైన హింసతో కూడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనుషుల తలలను నరకడం, చేతులను వేరు చేయడం వంటి భీభత్సమైన దృశ్యాలను చూపించారు. ‘Justice will be brutal’ (న్యాయం చాలా క్రూరంగా ఉంటుంది) అనే నినాదంతో సినిమా కథాంశం ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో వివరించారు. గ్లింప్స్ చివర్లో రవిబాబు రక్తం అంటిన ఒక పెద్ద ఆయుధాన్ని (రేజర్) పట్టుకుని చాలా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2026 వేసవి కాలంలో థియేటర్లలో విడుదల కానుంది.

Read also-Mysaa Glimpse: రష్మిక మంధాన ‘మైసా’ నుంచి ఈ గ్లింప్స్ చూశారా.. ఏం యాక్షన్ భయ్యా..

రేజర్ వీడియో చూడాలంటే?.. ఇక్కడ క్లిక్ చేయండి.

Just In

01

CM Revanth Reddy: ‘కేటీఆర్.. నువ్వెంతా? నీ స్థాయి ఎంత?’.. సీఎం రేవంత్ వైల్డ్ ఫైర్!

Additional Collector Anil Kumar: వినియోగ దారులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్!

Cyber Fraud: ఓరి దేవుడా.. డిజిటల్ అరెస్ట్ పేరిట.. రూ.9 కోట్లు దోచేశారు

Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. మిగతా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా..

MLA Kadiyam Srihari: క‌డియంకు స‌వాల్‌గా మారిన ఎమ్మెల్యే ప‌ద‌వి.. నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు!