Mysaa Glimpse: రష్మిక మంధాన ‘మైసా’ నుంచి ఈ గ్లింప్స్ చూశారా..
mysaa-glimps(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Mysaa Glimpse: రష్మిక మంధాన ‘మైసా’ నుంచి ఈ గ్లింప్స్ చూశారా.. ఏం యాక్షన్ భయ్యా..

Mysaa Glimpse: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న “మైసా” (Mysaa) చిత్రానికి సంబంధించిన మొదటి గ్లింప్స్ (First Glimpse) విడుదలయ్యింది. ఈ సినిమా ద్వారా రష్మిక ఒక సరికొత్త యాక్షన్ అవతారంలో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ గ్లింప్స్ వీడియోలో రష్మిక మందన్న మునుపెన్నడూ లేని విధంగా ఒక తీవ్రమైన (Intense) పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. అడవి నేపథ్యం, కాలిపోతున్న చెట్లు, చేతిలో గన్‌తో శత్రువులను ఎదుర్కొనే ఆమె నటన గగుర్పాటు కలిగించేలా ఉంది. “ఆఖరికి సావే చచ్చిపోయింది నా బిడ్డను చంపలేక” అనే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Read also-Dhurandhar Movie: ‘ధురంధర్’ మొదటి భాగం తెలుగు వర్షన్‌కు బ్రేక్.. నేరుగా పార్ట్ 2తోనే పలకరింపు!

రవీంద్ర పుల్లె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ (Unformula Films) మరియు టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రేయాస్ కృష్ణ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోంది. మైసా చిత్రం 2026 లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రష్మిక తన కెరీర్‌లో చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో ఇది ఒకటి కాబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read also-Varanasi Movie: కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘వారణాసి’.. ప్రకాష్ రాజ్ ఎం అన్నారంటే?

Just In

01

CM Revanth Reddy: ‘కేటీఆర్.. నువ్వెంతా? నీ స్థాయి ఎంత?’.. సీఎం రేవంత్ వైల్డ్ ఫైర్!

Additional Collector Anil Kumar: వినియోగ దారులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్!

Cyber Fraud: ఓరి దేవుడా.. డిజిటల్ అరెస్ట్ పేరిట.. రూ.9 కోట్లు దోచేశారు

Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. మిగతా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా..

MLA Kadiyam Srihari: క‌డియంకు స‌వాల్‌గా మారిన ఎమ్మెల్యే ప‌ద‌వి.. నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు!