ACB Raids: వరుస ఏసీబీ దాడులతో జంకుతున్న అధికారులు
ACB Raids (imagecredit:twitter)
Telangana News

ACB Raids: రవాణాశాఖపై ఏసీబీ నజర్.. వరుస దాడులతో జంకుతున్న అధికారులు

ACB Raids: ఏసీబీ అధికారులు దూకుడు పెంచినా.. రవాణాశాఖ అధికారుల తీరు మారడం లేదు. వరుస సోదాలు నిర్వహిస్తూ అవినీతి పరుల భరతం పడుతున్నా.. అధికారుల అవినీతి మాత్రం కొనసాగుతున్నది. దీంతో రవాణా శాఖపై ఏసీబీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వరుస దాడులు నిర్వహిస్తుంది. ఈ తనిఖీల్లో ఆదాయం మించిన ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అవినీతి ఆరోపణలు వస్తుండటంతో ఎవరెవరూ ఉన్నారు.. ఎవరి పనితీరు ఎలా ఉంది.. ఏం చేస్తున్నారనే వివరాలను ఇప్పటికే కొంతమంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ఒక్కొక్కరిపై దాడులు చేయాలని భావించి ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు ముందుకు సాగుతున్నారు. అయితే, ఏసీబీ దగ్గర ఎవరి పేర్లు ఉన్నాయనే దానిపైనా కొంతమంది అధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

భారీగా ఆస్తులు కూడబెట్టిన వారి వివరాలపై ఆరా

స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ(ఎస్టీఏ) రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రధాన శాఖల్లో ఒకటి. ఇందులో వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ తనిఖీ, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన ఎక్స్ టెన్షన్ జారీ ప్రధానమైనవి. అయితే, అధికారులు తనిఖీలు, లైసెన్స్ జారీ సమయాల్లోనూ, ప్రైవేట్ బస్సుల యాజమాన్యాల నుంచి సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రాకుండా గండి కొడుతున్నారని విమర్శలున్నాయి. అంతేకాదు కొంతమంది బాధితులు ఏకంగా ఏసీబీ అధికారులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. దీంతో వారు రవాణాశాఖపై దృష్టిసారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆదాయానికి మించి ఎవరెవరూ ఆస్తులు కూడబెట్టారనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కువగా ఆర్టీవో లేదా డీటీసీ, లేదా ఏవో లేదా జేటీసీ ఇలా వివిధ హోదాలో పనిచేస్తున్న పలువురిపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఆఫీసులనే అడ్డగా చేసుకొని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ ఆదాయానికి మించి ఆస్తులు కూడగడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఆఫీసర్లు ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకొని మరీ వసూల్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది.

Also Read: Hyderabad Crime: సెల్​ ఫోన్ గొడవ.. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు..?

ఇటీవల పట్టుబడిన అధికారులు

ఈ ఏడాది ఫిబ్రవరి‌లో హనుమకొండ ట్రాన్స్‌పోర్ట్‌ డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌పై ఫిర్యాదులు రావడంతో ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, వరంగల్‌తో పాటు 8 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ డీటీసీ శ్రీనివాస్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఆయన ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించి దాదాపు రూ.10 కోట్ల ఆస్తుల ఉన్నట్లుగా గుర్తించింది. మూడు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లా మాజీ రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో మహబూబాబాద్, హైదరాబాద్, కరీంనగర్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. దాదాపు రూ.10 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ఆయన ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయ్యారు. ఆయనపై మళ్లీ ఫిర్యాదులు రావడంతో ఏసీబీ సోదాలు చేపట్టి, ఆస్తులను గుర్తించింది. మూడు రోజుల క్రితం ఖమ్మం ఆర్టీవో కార్యాలయంపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. రెండో రోజులు సోదాలు నిర్వహించారు. సుమారు 20 గంటల వాటు సోదాలు చేపట్టి 20 మంది ప్రైవేట్‌ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి

ఏకకాలంలో ఆరు చోట్ల

మంగళవారం మహబూబ్‌నగర్ డీటీసీ కిషన్ నాయక్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఆరు చోట్ల ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. ఆదాయంకి మించి ఆస్తులు కూడా పెట్టారని, అవినీతి ఆరోపణల ఫిర్యాదుల నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏసీబీ అధికారుల దాడులతో రవాణా శాఖ అధికారులు ఉలికిపడుతున్నారు. ఎప్పుడు ఏ అధికారి ఇంటిపై ఏసీబీ సోదాలు చేస్తుందని ఆందోళకు గురవుతున్నారు.

తమపై ఎవరైనా ఫిర్యాదు చేస్తున్నారా అని ఆరా

ఏసీబీ వరుస దాడులతో రవాణాశాఖ అధికారులు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఏసీబీ అధికారులకు తమపైనా ఎవరైనా ఫిర్యాదు చేస్తున్నారా? ఎవరిపై ఎవరు చేస్తున్నారనే వివరాలను పలువురు అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. కొంతమంది డిపార్టు మెంట్లో తమకు గిట్టనివారు ఎవరైనా ఫిర్యాదు చేయిస్తున్నారా? అనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని ఎస్టీఏ కార్యాలయంపైనా ప్రధాన ఫోకస్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయం కూడా అక్కడే ఉండటంతో కొంతమంది ఏజెంట్లు కార్యాలయానికి పనిమిత్తం వెళ్లిన ప్రతి ఒక్కరినీ లైసెన్స్ ఇప్పిస్తామని, వాహనం రిజిస్ట్రేషన్ చేయిస్తామని అడుగుతున్నారు. ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆ ప్రైవేటు ఏజెంట్లను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఏ అధికారి అండ ఉంది తదితర వివరాలను సైతం సేకరించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం.

Also Read: Mahabubabad District: బినామీ రైతుల పేర్లతో వరి దందా.. అధికారుల మౌనమే అక్రమాలకు కారణమా?

Just In

01

CM Revanth Reddy: ‘కేటీఆర్.. నువ్వెంతా? నీ స్థాయి ఎంత?’.. సీఎం రేవంత్ వైల్డ్ ఫైర్!

Additional Collector Anil Kumar: వినియోగ దారులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్!

Cyber Fraud: ఓరి దేవుడా.. డిజిటల్ అరెస్ట్ పేరిట.. రూ.9 కోట్లు దోచేశారు

Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. మిగతా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా..

MLA Kadiyam Srihari: క‌డియంకు స‌వాల్‌గా మారిన ఎమ్మెల్యే ప‌ద‌వి.. నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు!