CM Revanth Reddy: జనవరి 26 లోపు ఉద్యోగుల వివరాలు
CM Revanth Reddy ( image credit: swetcha reporter)
Telangana News

CM Revanth Reddy: జనవరి 26 లోపు ఉద్యోగుల వివరాలు అందజేయాలి.. ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం!

CM Revanth Reddy: ప్రభుత్వానికి ఆఫీసర్లు సహకరించాలని, అప్పుడే ప్రజా ప్రయోజిత నిర్ణయాలు మరింత పకడ్భందీగా అమలవుతాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు ఆదేశాలిచ్చారు. మంగళవారం ఆయన ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని, ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించగా, కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. కానీ ఇంకా చేయాల్సిన పని చాలా ఉన్నదన్నారు. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ లాంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయని, అందుకే ముఖ్యమైన విభాగాలకు ఒక పాలసీని తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామన్నారు.

Also Read: CM Revanth Reddy: సర్పంచ్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్క్రీనింగ్!

ప్రతీ నెల కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్ష

రాష్ట్రాన్ని క్యూర్ , ప్యూర్ , రేర్ గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నామన్నారు.స్పష్టమైన విధి విధానాలతో ముందుకు వెళుతున్నామన్నారు. ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా..అధికారుల సహకారం ఉండాలన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలన్నారు. ఇక నుంచి ప్రతీ నెల కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్షిస్తారన్నారు.కార్యదర్శులు సీఎస్ కు ప్రతీ నెల రిపోర్ట్ సమర్పించాలన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆఫీసర్ల పనితీరుపై స్వయంగా తానే సమీక్షిస్తానని చెప్పారు. శాఖల మధ్య, శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి ఫలితాలు రావన్నారు. సమన్వయం చేసుకుని పనిచేయడం అత్యంత కీలకమన్నారు. అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.

జనవరి 26 లోగా సీఎస్ కు అందించాలి

మరోవైపు ప్రతీ సెక్రటరీ శాఖల్లో ఉన్న రెగ్యులర్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు జనవరి 26 లోగా సీఎస్ కు అందించాలని సూచించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల హెచ్ వోడీలు లు వెరిఫై చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను జనవరి 26 లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. ఇక జనవరి 26 లోపు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని సీఎం తెలిపారు.

Also Read: CM Revanth Reddy: పంచాయతీ ఫలితాలపై సీఎం రేవంత్ తొలిసారి స్పందన.. కేసీఆర్‌కు ఒక సవాలు

Just In

01

Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్​ సీరియస్.. చర్యలు తప్పవ్!

Aadi Sai Kumar: ‘శంబాల’ ఉందా? లేదా? అనేది తెలీదు కానీ, ‘కల్కీ’ తర్వాత ఆ పేరు వైరలైంది

AP CM Chandrababu Naidu: ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ సాధిస్తే.. వారికి రూ. 100 కోట్లు ఇస్తా! మళ్లీ అదే సవాల్!

Ramchander Rao: ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ వేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Uttam Kumar Reddy: పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!