impact-of-stress-on-heart
లైఫ్‌స్టైల్

Impact Of Stress On Heart: ఒత్తిడి గుండెపై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది?

Impact Of Stress On Heart: నిరంతర ఒత్తిడి మీ మూడ్, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, రోగనిరోధక శక్తితో పాటు మొత్తం శరీర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి శారీరక, మానసిక సమ‌స్య‌ల‌ను కలిగించవచ్చు. నొప్పులు, వేగంగా గుండె కొట్టుకోవడం, జీర్ణ సమస్యలు, ఆందోళన, మానసిక నిరుత్సాహం, చిరాకు, తలనొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. అదుపులో లేని ఒత్తిడి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ నేపథ్యంలో, స్ట్రెస్ మీ హృదయ ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో, అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అనే అంశం గురించి తెలుసుకుందాం.

ఒత్తిడి గుండె ఆరోగ్యంపై చూపే ప్రభావం

Impact Of Stress On Heart హృదయ సంబంధిత వ్యాధులు: స్ట్రెస్ రక్తపోటును పెంచుతుంది. ఇది గుండె వ్యాధికి ప్రధాన కారణాలలో ఒకటి. అంతేకాకుండా, ఇది హార్ట్ రేట్‌ను పెంచి ఒత్తిడిని పెంచుతుంది.

అనారోగ్యమైన అలవాట్లు: నిరంతర ఒత్తిడి వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంలో విఫలం కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవకపోవడం, వ్యాయామం చేయకపోవడం, పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు గుండె వ్యాధికి దారితీస్తాయి.

శరీరంలో పెరిగిన ఇన్‌ఫ్ల‌మేష‌న్: దీర్ఘకాలిక స్ట్రెస్ వల్ల శరీరంలో ఇన్‌ఫ్ల‌మేష‌న్ పెరిగిపోతుంది. ఇది రక్తనాళాలలో ప్లాక్ పేరుకుపోయేలా చేసి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

హృదయ సంబంధిత సమస్యలు: స్ట్రెస్ వల్ల హృదయ స్పందన క్రమం తప్పిన విధంగా మారే అవకాశముంది.

గుండెను ఎలా కాపాడుకోవాలి?

ఒత్తిడి లక్షణాలను ముందుగానే గుర్తించి, వాటిని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకోవ‌డం ఎంతో ముఖ్యం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి స్ట్రెస్ నిర్వహణ చాలా అవసరం.

వ్యాయామం చేయండి: నిత్యం వ్యాయామం చేయడం స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడుతుంది.

మెడిటేష‌న్, బ్రీతింగ్ వ్యాయామాలు: ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవు.

వృత్తిపరమైన సహాయం పొందండి: అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయాన్ని పొందడం మంచిది.

ఇతర స్ట్రెస్ ప్రభావాలు

స్ట్రెస్ వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

నిద్రలేమి సమస్యలు రావ‌చ్చు.

రోగనిరోధక శక్తిని తగ్గించగలదు.

హార్మోన్ల అసమతుల్యతను పెంచి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

ఒత్తిడిని ఎలా దూరం చేయాలి?

మీకు ఏ విష‌యంలో ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుందో ఒక ఐడియా ఉండే ఉంటుంది క‌దా..! ఉదాహ‌ర‌ణ‌కు మీకు ఉద్యోగంలో మీరు చేసే ప‌ని విష‌యంలో ఒత్తిడి ఉంద‌నుకుందాం. దీని గురించి మీరు బాగా ఆలోచించాలి. వ‌ర్క్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఒత్తిడి ఉంటోందా.. లేదా టైంకి కంప్లీట్ చేయ‌క‌పోతే మేనేజ‌రో, బాసో తిడ‌తార‌న్న ఒత్తిడి ఉంటోందా? వ‌ర్క్ ఎక్కువ‌గా ఉంటే ముందు మీరు చిన్న చిన్న టాస్క్‌లుగా విభ‌జించుకుని కంప్లీట్ చేయ‌చ్చు. కానీ మేనేజ‌ర్, బాస్ తిడ‌తార‌న్న విష‌యంలో ఒత్తిడి ఉంటే మాత్రం మీరు టాక్సిక్ ప్లేస్‌లో వ‌ర్క్ చేస్తున్నార‌ని తెలుసుకోండి. కంపెనీల్లో ఎవ‌రు ఎవ‌ర్నీ తిట్ట‌డానికి వీల్లేదు. పోనీ ఇత‌ర కుటుంబ స‌మ‌స్య‌ల వ‌ల్ల ఒత్తిడి ఉంటే మీ ఇంట్లోవారితో కూర్చుని చ‌ర్చించుకోండి. ఇలా ఏ విష‌యంలో మీకు ఒత్తిడి ఉన్నా కూడా ముందు దానిని ఓ పుస్త‌కంలో రాసుకోండి. మీ వ‌ల్ల కావ‌డం లేదు అనుకుంటే ఒక మంచి సైకాల‌జిస్ట్‌ను సంప్ర‌దించి చూడండి.

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?