Sangareddy District: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం లోని సిర్గాపూర్ మండలంలోని ఓ ప్రైవేటు సంపంగి ఫామ్ ల్యాండ్ యాజమాన్యం తమ స్వార్థం కోసం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎముకలు కొరుకుతున్న చలిలో కూర్చోబెట్టి సమావేశం పెట్టడం సమంజసం కాదని ఎఐఎస్ఎఫ్ నాయకులు గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిఏఓ గారికి వినతి పత్రం అందజేశారు.
విద్యార్థులను తీసుకెళ్లి కూర్చోబెట్టడం సమంజసం
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 30 పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్లు ఇస్తామని ఆశ చూపి పాఠశాల అనంతరం అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ వెంచర్ లోకి తీసుకెళ్లి రాత్రి 11 గంటల వరకు కూర్చోబెట్టుకొని ఒకవైపు చలికి వణుకుతున్న పట్టించుకోకుండా తమ సమావేశం పూర్తయ్యే వరకు వేదికను విద్యార్థులతో నింపి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను తీసుకెళ్లి కూర్చోబెట్టడం సమంజసం కాదన్నారు.
Also Read: Sangareddy District: ఫార్మా కంపెనీ వద్దంటూ.. కర్మాగారం ముందు గ్రామస్తులు ఆందోళన
వెంచర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి
ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టి అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు ఎంఈఓ లు ప్రధానోపాధ్యాయులను విధుల నుంచి తొలగించి వెంచర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై డిఇఓ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అశోక్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Sangareddy district: చెరువుకు వెళ్లి ఇద్దరి వ్యక్తులు గల్లంతు.. గాలిస్తున్న గజ ఈతగాళ్లు

