Ravi Kiran Kola: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న క్రేజీ మూవీకి ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘రౌడీ జనార్థన’ టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ని కూడా మేకర్స్ వదిలారు. సోమవారం హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింత మధ్య ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ వదిలారు. ఈ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ ఊర మాస్ అవతార్‌లో టైటిల్‌కు తగ్గట్టుగానే కనిపించి అందరినీ అలరించారు. ఇంకా చెప్పాలంటే మాస్ ట్రీట్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ గ్లింప్స్ లాంఛ్ వేడుకలో దర్శకుడు రవి కిరణ్ కోలా కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
Also Read- Nari Nari Naduma Murari: రాజాలా పెంచితే రోజా ముందు.. ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ ఎలా ఉందంటే?
టైటిల్ ఆల్రెడీ తెలిసిపోయింది.. అందుకే ఇది!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. నేను ఎంతగానో అభిమానించే కీర్తి సురేష్, దిల్ రాజు వంటి వారితో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘రౌడీ జనార్ధన’ టైటిల్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. రౌడీ జనార్ధన ఎలా ఉంటాడో పరిచయం చేసిన తర్వాతే టైటిల్ రివీల్ చేయాలని అనుకున్నాం. కానీ టైటిల్ ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా వస్తోంది. దీని కోసం మా టీమ్ మెంబర్స్ చాలా కష్టపడుతున్నారు. ఇకపై మా మూవీ నుంచి రిలీజ్ చేసే కంటెంట్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ కథ చెప్పిన కొద్దిసేపటికే విజయ్ ఆ క్యారెక్టర్‌లా మాట్లాడటం, చెప్పే సీన్‌కు రౌడీ జనార్ధనలాగానే రియాక్ట్ అవడం స్టార్ట్ చేశాడు. ఇన్‌స్టంట్‌గా క్యారెక్టర్‌ను ఓన్ చేసుకున్నాడు. దీంతో నాకు కూడా ఎంకరేజింగ్‌గా అనిపించి మిగతా స్క్రిప్ట్ మొత్తం ఉత్సాహంగా చెప్పేశాను.
Also Read- Bigg Boss House: గ్రాండ్ ఫినాలే అనంతరం.. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూశారా? వీడియో వైరల్!
ఈస్ట్ గోదావరి యాస హైలెట్..
కథ చెప్పడం పూర్తయిన తర్వాత మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. అలా ఈ రౌడీ జనార్ధన ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. వర్క్ షాప్స్ అన్నీ చేసి, ఫస్ట్ డే షూట్ కోసం సెట్ రెడీ అయ్యాం. 8 నిమిషాల లాంగ్ సీన్ చేయాలి. ఆ ముందు రోజే విజయ్ సెట్‌లోకి వచ్చి ఆ డైలాగ్స్ మొత్తం చెప్పేస్తున్నాడు. అప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెంట్‌గా అనిపించింది. ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ చాలా ఆక్యురేట్‌గా డైలాగ్స్ చెబుతున్నారు. నేను కూడా ఆ ఏరియాలో పుట్టి, పెరిగిన వాడిని కాబట్టి.. తను సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. నిజంగా విజయ్ ఆ యాసలో మాట్లాడటం మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం. కథ ఎంత బాగుందో, ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం అనేది కూడా అంతే బాగుందని దిల్ రాజు సార్ చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించేది. అనేవారు. ఈ యాసలో డైలాగ్స్ ఫ్లేవర్ మిస్ కాకూడదని విజయ్, దిల్ రాజు సార్ పర్టిక్యులర్‌గా పట్టించుకునే వారు. ఇప్పటి వరకు అయిన షూట్ మొత్తం చాలా బాగా జరిగింది. ఇకపై అప్డేట్స్ వస్తూనే ఉంటాయని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

