Rowdy Janardhana: ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్.. అరాచకమే!
Rowdy Janardhana (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Rowdy Janardhana: ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్.. బాబోయ్ అరాచకమే!

Rowdy Janardhana: వరుస పరాజయాల అనంతరం రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ (SVC)లో ఆయన నటిస్తున్న క్రేజీ మూవీకి ‘రౌడీ జనార్థన’ (Rowdy Janardhana) అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ సోమవారం గ్లింప్స్ వదిలారు. వాస్తవానికి ఈ టైటిల్ ఎప్పుడే లీకైంది. ఈ సినిమాకు టైటిల్ ఇదే అని, సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది. అదే టైటిల్‌ని మేకర్స్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ (Rowdy Janardhana Title Glimpse) వదిలారు. ఈ గ్లింప్స్ చూస్తే మాత్రం అసలు సిసలైన రౌడీ రాబోతున్నాడనే ఫీల్ వచ్చేస్తుందంటే ఏ స్థాయిలో ఇది ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్లింప్స్‌ని గమనిస్తే..

Also Read- Drishyam 3: మళ్ళీ వస్తున్న విజయ్ సల్గాంకర్.. ‘దృశ్యం 3’ అధికారిక ప్రకటన వచ్చేసింది

ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే..

‘లైగర్’ తరహాలో షర్ట్ లెస్‌గా విజయ్ దేవరకొండ ఈ గ్లింప్స్‌లో కనిపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ అభిమానులకు మాస్ ట్రీట్ ఇస్తోంది. ‘బండెడు అన్నం తిని, కుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడైనా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో వాడి కథను వాడే రాసుకున్నాడు. కన్నీళ్లను ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్లముందుకు వచ్చి నిలబడితే.. కత్తై లేచి కలబడినాడు.. కలబడ్డాడు నాలోపల’’ అని పవర్ ఫుల్ డైలాగ్ అనంతరం.. ‘నాకాడా ఉన్నారు కొమ్ములు దిరిగిన రాక్షసులు, రక్తానికి మరిగిన రౌడీలు’ అని విలన్ అంటే.. ‘కళింగపట్నంలో ఇంటికో లం**డుకు నేను రౌడీనని చెప్పుకుని తిరుగుతాడు. కానీ, ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు. జనార్ధన.. రౌడీ జనార్ధన’ అంటూ విజయ్ దేవరకొండ చేసిన విరోచిత విన్యాసం ఫ్యాన్స్‌నే కాదు, ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? అని వెయిట్ చేసేలా చేస్తుంది. ఈ గ్లింప్స్‌తో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ తరహా మాస్ మూవీ వచ్చి, చాలా కాలమే అవుతుంది. ఇప్పుడు దిగితే మాత్రం.. బాక్సాఫీస్ గల్లంతవడం పక్కా.. అనేలా ఈ గ్లింప్స్ సినిమాపై క్రేజ్‌కి కారణమవుతోంది.

Also Read- Sai Kumar: ‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం

ఈస్ట్ గోదావరి యాసలో

స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ‘రౌడీ జనార్ధన’ రూపొందుతోంది. గ్లింప్స్ విడుదల సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులకు చూపించేందుకు రవి కిరణ్ కొద్ది రోజులుగా తన టీమ్‌తో ఎంతగానో వర్క్ చేస్తూ వచ్చాడు. మూడు రోజుల క్రితం ఈ సినిమాను ఎలా చూపించబోతున్నాం అనేది చిన్న స్టోరీ రివీల్ చేశాడు. విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ వచ్చాడు కానీ.. తొలిసారిగా ఈ మూవీలో ఆంధ్రలోని ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడుతూ, అందరినీ అలరించబోతున్నాడు. విజయ్ ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడటం ఈ స్టోరీ విన్నప్పుడు నాకు యూనిక్‌గా అనిపించింది. విజయ్ ఇప్పటి వరకు ఇంత మాస్, బ్లడ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో విజయ్ కనిపించబోతున్నాడు. 80 దశకం బ్యాక్ డ్రాప్‌లోని వరల్డ్‌ను ఈ సూపర్బ్ టెక్నీషియన్స్ అంతా క్రియేట్ చేశారు. రవికిరణ్ విజన్‌లోని కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు టీమ్ అంతా కష్టపడుతోంది. అందరినీ అలరించేందుకు ఈ మూవీని నెక్ట్స్ ఇయర్ రిలీజ్‌కు తీసుకొస్తామని చెప్పారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Emmanuel: ఇమ్మానుయేల్‌కు ఇంత అన్యాయమా? ఏంటిది బిగ్ బాస్?

Ravi Kiran Kola: విజయ్‌తో ‘రౌడీ జనార్ధన’ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యిందంటే?

Bigg Boss House: గ్రాండ్ ఫినాలే అనంతరం.. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూశారా? వీడియో వైరల్!

Ponguleti Srinivas Reddy: భూభారతి పోర్టల్‌తో అనుసంధానం.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూస‌మాచారం!

Jupally Krishna Rao: కేసీఆర్‌ కుటుంబ రాజకీయాలే ఆ పార్టీ పతనానికి కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు