Eesha Song: ప్రస్తుత కాలంలో సినిమాల్లో కేవలం ప్రేమ కథలే కాకుండా, మానవ సంబంధాలను, ముఖ్యంగా స్నేహ బంధాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తున్నారు. తాజాగా త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఈషా’ (Eesha). ఈ సినిమాలోని “ఆ నింగిలోని చందమామ” అనే లిరికల్ సాంగ్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ తన మధురమైన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోశారు. స్నేహం గురించి చెప్పే పాటల్లో ఉండే ఒక రకమైన భావోద్వేగాన్ని ఆమె తన గాత్రంతో అద్భుతంగా పండించారు. ఆర్ ఆర్ ధ్రువన్ అందించిన సంగీతం వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా, హుషారుగా ఉంది. మెలోడీ, రిథమ్ కలగలిసిన ఈ బాణీ శ్రోతలను వెంటనే కనెక్ట్ అయ్యేలా చేస్తోంది.
Read also-Apni Haddse: ‘అప్నీ హద్ సే’ టైటిల్ సాంగ్ విడుదల చేసిన జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్..
ఈ పాట అంతా స్నేహం యొక్క గొప్పతనాన్ని, జీవితంలో స్నేహితుడి స్థానాన్ని గొప్పగా వర్ణిస్తుంది. ఒక మంచి స్నేహితుడు తోడుంటే, ఆకాశంలోని చందమామను కూడా అందుకోవచ్చనే నమ్మకం కలుగుతుందని పాట చెబుతుంది. “అమ్మలాగా దారి మారుతోనే.. నాన్నలాగా దారి చూపుతోనే” అన్న సాహిత్యం ద్వారా, స్నేహితుడు అవసరమైనప్పుడు తల్లిలా ప్రేమిస్తాడని, తండ్రిలా మార్గనిర్దేశం చేస్తాడని చాలా అర్థవంతంగా వివరించారు. జీవిత గమనంలో స్నేహం.. ఎండమావి లాంటి కష్టాల సమయంలో స్నేహం అనేది చల్లని వల్లిలా వచ్చి చేరుతుందని, చేదు జ్ఞాపకాలను పంచదార లాంటి తీపి జ్ఞాపకాలుగా మారుస్తుందని ఈ పాట సందేశాన్ని ఇస్తుంది.
లిరికల్ వీడియోలో చూపిన దృశ్యాలు త్రిగుణ్, హెబ్బా పటేల్ మధ్య ఉండే స్నేహపూర్వక బంధాన్ని తెలియజేస్తున్నాయి. స్నేహాన్ని ఒక ‘మంత్రం’గా, ఒక ‘ఆస్తి’గా అభివర్ణించిన తీరు ప్రతి ఒక్కరినీ తమ పాత స్నేహితులను గుర్తు చేసుకునేలా చేస్తుంది. “కలలకే రూపం వచ్చినట్టు.. నీ ముందే నిలిచింది ఫ్రెండ్షిప్” అంటూ సాగే ఈ పాట కేవలం ఒక సినిమా పాటలా కాకుండా, స్నేహానికి ఒక నివాళిలా అనిపిస్తుంది. మంచి సాహిత్యం, శ్రేయా ఘోషల్ అద్భుత గానం తోడవ్వడంతో ఈ పాట సంగీత ప్రియుల ప్లేలిస్టులో తప్పకుండా చోటు దక్కించుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచారం పీక్స్ లో చేసింది. ఈ సినిమా చూసిన అందరూ ఖచ్చితంగా భయపడతారు అంటూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. అలాంటి హరర్ర సినిమా నుంచి ఇలాంటి ఫీల్ గుడ్ సాంగ్ రావడంతో అందరూ ఒక్క సారి గా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25, 2025న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

