Medical Mafia: అర్హత లేదుగానీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మాఫియా
Fake-Doctors (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Medical Mafia: అర్హత లేకుండా ఖరీదైన వైద్యం.. మిర్యాలగూడలో మెడికల్ మాఫియా

Medical Mafia: మిర్యాలగూడలో మెడికల్ దందా

అర్హతలు పక్కన పెట్టి… అడ్డగోలుగా వైద్యం
ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లే కంటివైద్య నిపుణులుగా చలామణి

నల్గొండ, స్వేచ్ఛ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీ మెడికల్ మాఫియాకు (Medical Mafia) కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. క్వాలిఫికేషన్ లేకుండా ఖరీదైన వైద్యంతో పేషెంట్లను గుల్ల చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఫేక్ బిల్లులను ఇచ్చిన కొన్ని ఆస్పత్రులు బోర్డు మార్చేశాయి. ఇంకొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ లేకుండానే, ఎంబీబీఎస్ మాత్రమే చేసి కంటి వైద్య నిపుణులుగా, ఇతర సర్జరీలు చేసే డాక్టర్లు మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో తిష్ట వేశారు. మెడికల్ హెల్త్ క్యాంపులు, రక్త ఇతర పరీక్షలకు ఆఫర్లు పెడుతూ ప్రజలను ఆకర్షిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు… జలగల్లా మారి అమాయక జనాన్ని అడ్డంగా దోచేస్తున్నారు.

స్థానికంగా నడుస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు కొన్నింటిలో ఐసీయూ యూనిట్స్ ఉన్నా రాత్రివేళ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు(డీఎంవో ) అందుబాటులో ఉండరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేషెంట్లను ఆస్పత్రి కాంపౌండర్‌లకు, సీనియర్ స్టాఫ్‌కు అప్పగించి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మళ్లీ హాస్పిటల్‌కి హడావుడిగా వస్తున్నట్లు తెలుస్తోంది. అర్హతలు లేకున్నా అడ్డగోలు వైద్యం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీ, చర్చి రోడ్డు రెడ్డి కాలనీ లో పలు ప్రైవేట్ ఆస్పత్రులు నడుస్తున్నాయి. వీటిలో జనరల్, గైనిక్, స్కిన్, చిల్డ్రన్స్, ఆర్థోపెడిక్, ఇతర విభాగాల్లో వైద్యం అందిస్తుంటారు. ఒక్కో ( ఔట్ పేషెంట్ ) ఉదయం వేళలో రూ.400, రాత్రి వేళల్లో కొంత అదనంగా తీసుకుంటున్నారు. సాధారణ జ్వరాలు, దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాస సంబంధిత, ఇతర ఇబ్బందులతో పేషెంట్లు ఆస్పత్రులకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఒక్కో అస్పత్రికి సుమారు రోజుకు 25 నుంచి 40 మంది పేషెంట్స్ వస్తుంటారు. ఓపీ ఫీజు చెల్లించేదే ఆలస్యం సంబంధిత డాక్టర్ గదిలోకి వెళ్లిన కేవలం 10 నుంచి 12 నిమిషాలకే ఆ పేషెంట్ కు అన్ని రకాల టెస్ట్ లను ప్రిఫర్ చేస్తారు. టెస్ట్ ల బిల్ రూ. 1500 నుంచి 2500, మెడిసిన్ కు రూ. 3 వేల నుంచి 5 వేలు, ఓపి ఫీజు 400 మొత్తంగా సుమారు 6 వేలను దండుకునే పరిస్థితి అందరికీ తెలిసిందే. పేషెంట్ కండిషన్ ఎలా ఉందని… ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లలో 90 శాతం మందికి టెస్ట్ కచ్చితంగా చేస్తూ అందరికీ సేమ్ ట్రీట్ మెంట్ ఇస్తూ తమ దోపిడిని యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

Read Also- Minister Ponguleti: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డు జీవో: మంత్రి పొంగులేటి

సుమారు ఆరేళ్లుగా గుట్టుగా వైద్యం

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల తనిఖీల్లో మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర, షాలిని కంటి ఆస్పత్రుల డాక్టర్లు భరత్ భూషణ్, కె. వెంకటేశ్వర్లు ఎంబీబీఎస్ మాత్రమే చదివి.. కంటి వైద్య నిపుణులుగా చలామణి అవుతున్నట్టు గుర్తించి చర్యలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే వీరు మిర్యాలగూడ పట్టణంలో సుమారు ఏడేళ్ల క్రితం ఆస్పత్రులను ఏర్పాటుచేసి నడిపిస్తున్నప్పటికీ వీరికి ఎంబీబీ ఎస్( ఆఫ్తల్మాలజీ) లేకున్న వైద్యం కొనసాగించటం… ఇన్నేళ్లుగా నల్గొండ జిల్లా వైద్య, లోకల్ వైద్యాధికారులు తనిఖీలు చేసిన ఈ ఫేక్ డాక్టర్ల వ్యవహారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల తనిఖీల్లోనే బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంతకుముందు వచ్చిన జిల్లా అధికారులతో.. లోకల్ మెడికల్ ఆఫీసర్లను మేనేజ్ చేస్తూ అర్హత లేని వైద్యాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు టీజీఎంసి అధికారులు ఫేక్ డాక్టర్లతోపాటు ప్రత్యేకంగా బెడ్స్ ఏర్పాటు స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్, ఇతర మెడిసిన్స్ ఇస్తున్న ఆర్ఎంపీ క్లినిక్లల పై దాడులు చేయటం కేసులను పెట్టడం గమనార్హం.

అర్హత లేకుండా వైద్యం చేయటం ఆశ్చర్యం: డిప్యూటీ డీఎం

‘‘తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు పలు కంటి ఆస్పత్రులపై తనిఖీలు చేశారు. డాక్టర్ భరత్ భూషణ్, వెంకటేశ్వర్లు ఎంబీ బీ ఎస్ మాత్రమే చదివి కంటి వైద్య నిపుణులుగా కొనసాగటం అది అధికారుల దాడుల్లో తేలటం ఆశ్చర్యపరిచింది. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు ప్రకారం కొనసాగేలా ప్రయత్నం చేస్తాం’’ అని మిర్యాలగూడ డిప్యూటీ డీఎంహెచ్‌వో కేస రవి అన్నారు.

Read Also- Jupally Krishna Rao: మోడీ, అమిత్ షా నియంతృత్వ పాలనను తరిమికొట్టాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

Just In

01

SIR in Telangana: తెలంగాణలో ‘సర్’.. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కీలక ప్రకటన

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. విన్నర్ కళ్యాణ్, రన్నర్ తనూజ

Bigg Boss Telugu 9: టెన్షన్ పెట్టిన బిగ్ బాస్.. టాప్ 5గా వెనుదిరిగిన సంజన..

Kishan Reddy: ఎప్పుడైనా ఆరా తీశారా? సోనియా గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

Fire Accident: నారాయణఖేడ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 3 వేల క్వింటాళ్ల పత్తి దగ్ధం