Best Breakfast Foods: ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) అనేది చాలా ముఖ్యం. తినకపోతే ఏదో అయిపోతుందని కాదు కానీ.. మనం రాత్రి వేళలో నిద్రపోయి దాదాపు 9 గంటల తర్వాత లేచి మలవిసర్జనకు వెళ్తాం. అప్పుడు ముందు రోజు తిన్నదంతా అరిగి అది మలం రూపంలో బయటికి వెళ్లిపోతుంది. అంటే మన పొట్ట శుభ్రం అయిపోతుంది కాబట్టి ఖాళీగా ఉంటుంది. మరి ఆ తర్వాత ఎనర్జీ కోసం తినాల్సిందే కదా. కాబట్టి ఉదయం పూట మంచి ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చేస్తే.. రోజంతా ఉత్సాహం ఉంటారు అని చెప్తుంటారు. ఈ రోజుల్లో ఇంటర్మింటెంట్ ఫాస్టింగ్ పేరుతో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే చేసి లంచ్, డిన్నర్ స్కిప్ చేస్తున్నారు. లేదా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ స్కిప్ చేసి డిన్నర్ మాత్రమే చేస్తున్నారు. మరికొందరు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ స్కిప్ చేసి లంచ్ మాత్రమే తింటున్నారు. ఇలా ఏది చేసినా మీకు వర్కవుట్ అవుతోందంటే ఫర్వాలేదు. ఒకవేళ ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ తినే అలవాటు ఉన్నవారికి.. ఈ టాప్ బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాస్ బాగుంటాయి. వీటిని తినడం ద్వారా బరువు కూడా అదుపులో ఉంటుంది. అవేంటో చూసేద్దాం.
బరువు తగ్గడానికి మంచి అల్పాహారం ఉండాల్సిందేనా?
Best Breakfast Foods పోషక విలువలతో కూడిన అల్పాహారం మీ మెటబాలిజాన్ని పెంచుతుంది, ఇది బరువును నియంత్రించడంలో కీలకం. మధ్యాహ్నం ముందు ఆకలిని అదుపలో ఉంచడంతో పాటు పాటు, అధికంగా తినకుండా చేస్తుంది. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన అల్పాహారం ఎక్కువ సేపు మంచి ఆహారం తిన్నామన్న తృప్తిని కలిగిస్తుంది. అలాగే, రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచి అనారోగ్యకరమైన స్నాక్స్‌పై ఆధారపడకుండా చేస్తుంది. అల్పాహారం మానేయడం మీ మెటబాలిజాన్ని మందగించించడంతో పాటు, శక్తి స్థాయిలను తగ్గించే అవకాశం కూడా ఉందని మాత్రం మర్చిపోవద్దు.
ఓట్స్
ఓట్స్‌లో అధికమైన ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీలింగ్ కలిగేలా చేస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. తక్కువగా తినాలి.. కడుపు నిండాలి. ఓట్స్‌లో తాజా పండ్లు, గింజలు కలిపితే రుచి, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమతులితమైన భోజనంగా మారుతుంది.
గ్రీక్ యోగర్ట్ మరియు బెర్రీలు
గ్రీక్ యోగర్ట్‌లో అధిక ప్రోటీన్ ఉండటంతో ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి పోషక విలువను పెంచుతాయి. ఇవి చాలా ఖరీదు అనుకుంటే వారంలో ఒకసారైనా బెర్రీలను తినేందుకు ప్రయత్నించండి.
బ్రెడ్ విత్ అవకాడో టోస్ట్
అవకాడోలోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఆకలిని నియంత్రించడంతో పాటు, హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. హోల్ వీట్ బ్రెడ్‌లో అధికమైన ఫైబర్ ఉంటుంది కాబట్టి త్వరగా కడుపు నిండేలా చేస్తుంది. ఈ బ్రెడ్‌తో అవకాడో టోస్ట్ చేసుకుని తింటే ఎంత ఎనర్జిటిక్‌గా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది.
పాలకూర, అరటిపండు, బాదం పాలతో స్మూతీ
ఈ స్మూతీ తక్కువ కాలరీలతో పాటు, అధిక పోషక విలువలను అందిస్తుంది. ఇది ఫైబర్, పొటాషియం, ముఖ్యమైన విటమిన్లు అందించడంతో పాటు, శరీరానికి తేలికగా ఉంచుతుంది.
సరైన కూరగాయలతో ఉడకబెట్టిన గుడ్లు
గుడ్లు అధిక ప్రోటీన్‌తో పాటు, ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటాయి. తక్కువ కాలరీల, పోషక విలువలతో కూడిన కూరగాయలైన పాలకూర, క్యాప్సికమ్ వంటి వాటితో కలిపి తింటే మంచి ఆహారంగా మారుతుంది.
చియా సీడ్ పుడ్డింగ్
చియా గింజల్లో ఒమేగా-3 కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఇవి ఆకలి నియంత్రించడానికి, శక్తిని అందించడానికి సహాయపడతాయి. బాదం పాలు, తేనె కలిపి తయారుచేసిన చియా పుడ్డింగ్ బెస్ట్ చాయిస్ అనే చెప్పాలి.
క్వినోవా
క్వినోవా పూర్తిగా ప్రోటీన్‌తో కూడిన ఆహారం. దీనిని గుమ్మడి, ప్రొద్దు తిరుగుడు వంటి గింజలు, తేనెతో కలిపి తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది.
అరటిపండు, పీనట్ బటర్
అరటిపండు సహజమైన కర్బోహైడ్రేట్లను అందిస్తుంది. పీనట్ బటర్ ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తుంది. ఈ రెండింటినీ కలిపి తింటే దాదాపు 5 గంటల పాటు ఆకలి వేయకుండా ఉంటుందట.