Vivo X200T : వివో ఇటీవల భారత్‌లో తన ఫ్లాగ్‌షిప్ Vivo X300 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కంపెనీ గత ఏడాది ఫ్లాగ్‌షిప్ లైనప్‌కు చెందిన మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కు Vivo X200T అనే పేరు ఉండవచ్చని టెక్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఆన్లైన్ లో దొరికిన తాజా సమాచారం ప్రకారం, Vivo X200T భారత్‌లో 2026 జనవరి చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్, స్టాండర్డ్ Vivo X200, కొత్తగా విడుదలైన Vivo X300 సిరీస్ మధ్య స్థానం దక్కించుకునేలా ఉండనుందని తెలుస్తోంది.
Also Read: Pade Pade Song: సంగీత ప్రియులను కట్టి పడేస్తున్న ఆది సాయికుమార్ ‘శంబాల’ నుంచి పదే పదే సాంగ్..
ఓ టిప్‌స్టర్ వెల్లడించిన లీక్‌ల ప్రకారం, Vivo X200Tకు MediaTek Dimensity 9400+ చిప్‌సెట్ శక్తినివ్వనుంది. భద్రత కోసం ఇందులో 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. అలాగే, ఫోన్ వేడి నియంత్రణ కోసం ఆధునిక కూలింగ్ టెక్నాలజీని అందించనున్నారు.
గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచేందుకు ఈ ఫోన్‌లో 4.5K నానోఫ్లూయిడ్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, వర్చువల్ గ్రాఫిక్స్ కార్డ్, AI ఆధారిత ఫ్రేమ్ ఇంటర్‌పొలేషన్ టెక్నాలజీ ఉండవచ్చని సమాచారం. ఇవి గేమ్స్ ఆడేటప్పుడు స్మూత్ విజువల్స్ అందించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. బ్యాటరీ సామర్థ్యం ఇంకా వెల్లడి కాలేదు కానీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్ అందించనున్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా, 5 OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఉండవచ్చని సమాచారం.
Vivo X200T, ఇప్పటికే విడుదలైన Vivo X200 FEకు సమానంగా ఉండి, ఇంకా అదనపు అప్‌గ్రేడ్స్‌తో రానుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల దీని ధర X200 FE కంటే కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, Vivo నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో, ఈ వివరాలను లీక్‌లుగా మాత్రమే పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు.

