Bigg Boss Telugu 9 Winner: తెలుగు రియాలిటీ షోలలో అగ్రగామిగా నిలిచే ‘బిగ్ బాస్’ సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు సిద్ధమైంది. ఈ ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి విజేత ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్ కంటెస్టెంట్లలో కళ్యాణ్ పడాల (పవన్), తనూజ, ఇమ్మాన్యుయేల్ మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది.
Read also-Sreenivasan Death: ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత.. మోహన్ లాల్‌తో అద్భుత ప్రయాణం..
ప్రస్తుతం అందుతున్న అనధికారిక ఓటింగ్ సమాచారం ప్రకారం, కంటెస్టెంట్ల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది.
ముందంజలో కళ్యాణ్ పడాల
ఈ సీజన్‌లో ‘కామన్ మ్యాన్’ కోటాలో ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన కళ్యాణ్ పడాల ప్రస్తుతం ఓటింగ్ రేసులో టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తన నిబద్ధత, ముక్కుసూటితనం మరియు టాస్కులలో చూపే ప్రతిభతో అతను భారీ ప్రజాభిమానాన్ని గెలుచుకున్నాడు. గతంలో పల్లవి ప్రశాంత్ సాధించిన విజయాన్ని కళ్యాణ్ రిపీట్ చేస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
చరిత్ర సృష్టించే దిశగా తనూజ
బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్నా, ఒక్క మహిళా కంటెస్టెంట్ కూడా టైటిల్ గెలవలేదు. ఈసారి ఆ రికార్డును తనూజ పుట్టస్వామి తిరగరాస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఓటింగ్‌లో ఆమె రెండో స్థానంలో ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో మహిళా ఓటర్ల మద్దతు తనూజకు లభిస్తే ఆమె విన్నర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
డార్క్ హార్స్‌గా ఇమ్మాన్యుయేల్
తన కామెడీ టైమింగ్‌తో షోకు ఎంటర్‌టైన్‌మెంట్ అద్దిన ఇమ్మాన్యుయేల్, ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నట్లు సమాచారం. హౌస్‌లో అందరితో కలివిడిగా ఉంటూ, ఎలాంటి నెగెటివిటీ లేకుండా ప్రయాణించిన ఇమ్మాన్యుయేల్.. ఏదైనా మిరాకిల్ జరిగితే రన్నరప్ లేదా విన్నర్ రేసులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Read also-Avatar3 Box Office: ‘అవతార్ 3’ తొలిరోజు ప్రపంచ వసూళ్లు చూస్తే మతి పోవాల్సిందే?.. ఇండియాలో ఎంతంటే?
గ్రాండ్ ఫినాలే హైలైట్స్
ఈ సీజన్ ఫినాలేకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే బిగ్ బాస్ రేటింగ్స్ మరోసారి రికార్డులు సృష్టించడం ఖాయం. విజేతకు రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్, సువర్ణభూమి ప్లాట్, మారుతి సుజుకి కార్ లభించనున్నాయి. టాప్ 5లో ఉన్న డీమాన్ పవన్, నిఖిల్ మధ్య మూడో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. ఎవరు గెలిచినా ఈ సీజన్ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. కళ్యాణ్ పడాల తన ‘ఆర్మీ’ బలాన్ని చాటుతాడా? లేక తనూజ మహిళా విన్నర్ కలను నిజం చేస్తుందా? అన్నది మరో కొన్ని గంటల్లో తేలిపోనుంది.

