దివ్యాoగులను ఆదుకునేoదుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుంటాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వారికి ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. వీలైoతవరకు దివ్యాంగుల సమస్యలనుపరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం లో రామ్మోహన్ నాయడు పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధుల కింద అందించిన ట్రై సైకిళ్ళు, వినికిడి యంత్రాలు మంత్రి రామ్మోహన్ నాయడు అందించారు. స్వాభిమాన్ కార్యక్రమం క్రింద కూడా ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని రామ్మోహన్ నాయుడు అన్నారు.