Real Estate Scam: మైరాన్ ప్రీలాంచ్‌కు సాక్ష్యాలు ఇవిగో?
Real Estate Scam ( image credit: twitter or swetcha reporter)
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Real Estate Scam: మైరాన్ ప్రీలాంచ్‌కు సాక్ష్యాలు ఇవిగో? కస్టమర్స్ అందరూ సినీ, సాఫ్ట్‌వేర్ ప్రముఖులే?

Real Estate Scam: జర్నలిజంలో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు చాలా అరుదు. వారు వార్తలు రాస్తే మోసగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. పబ్లిక్‌ను మోసం చేసి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన ప్రతివాడు, జర్నలిస్టులను ఒకే తాటి పైకి తెచ్చేందుకు చూస్తాడు. అలా అయితే ఎవరూ తమ గురించి ఆలోచించరని రియల్ ఎస్టేట్ మోసగాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ, జర్నలిజం పవర్ ఏంటో ‘స్వేచ్ఛ’ చూపిస్తున్నది. ఒకప్పుడు సాహితీ కన్‌స్ట్రక్షన్స్, వాసవి, భారతీ బిల్డర్స్, వంశీరాం, ఫినిక్స్ ఇలా ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రభుత్వాల నుంచి భారీగా లబ్ధి పొంది, సాధారణ ఉద్యోగ కుటుంబాలను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడ్డాయి.


వాటిపై ‘స్వేచ్ఛ’ సంచలన కథనాలు ఇచ్చింది. వాటి బాటలో మైరాన్ హోమ్స్ బాచుపల్లిలో ఆసియాలోనే అతి పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ అంటూ సెల్లార్స్ చూపించి 4 లక్షల స్క్వేర్ ఫీట్స్ అమ్మిందనే ఆరోపణ ఉన్నది. 5 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఎల్పీ నెంబర్ వేసుకుని రెండేండ్ల నుంచి అమ్మకాలు ప్రారంభించింది. అద్దె వస్తుందనే ఆశతో 200 ఫీట్స్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో, ఎప్పుడైనా మంచి గిరాకీ ఉంటుందని ఎంతోమంది సాఫ్ట్‌వేర్స్ కొనుగోలు చేశారు. అలాగే, సినీ పెద్దల నుంచి బ్లాక్ మనీ భారీగానే వసూలు చేశారని వాళ్ల ఉద్యోగులే చెబుతున్నారు.

Also Read: Real Estate Scam: జనం నుంచి కోట్లలో డబ్బు వసూళ్లు.. నిలువునా మోసపోయిన 250 మంది


‘స్వేచ్ఛ’ వార్తలతో సోషల్ మీడియాలో వీడియోలు డిలీట్

మైరాన్ హోమ్స్ సీఎండీ అండ్ పౌండర్ యువరాజ్ మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఓపెన్ ప్లాట్స్‌లో తన భూమి కాకున్నా అమ్మకాలు జరిపారు. జీపీఏ చేసుకుంది కొంచెం. అమ్మింది అనేకం. జహీరాబాద్‌లో కేసులు కూడా అయ్యాయి. దీనితో పాటు బాచుపల్లిలో లిటిగేషన్ ల్యాండ్‌లో పెట్టుబడి పెట్టారు. ప్రాజెక్ట్ వదిలేసినా వందల కోట్లు ఎలా సంపాదించాలో తెలుసుకున్నారు. ఎలాంటి పూర్తి అనుమతులు లేకుండానే రెరాకు అప్లై చేయకుండానే రెండేండ్ల నుంచి అమ్మకాలు చేస్తున్నారు.

ఇలా ఇప్పటికీ వాళ్ల సీఈవో రాజ్ నారాయణ మాటల్లోనే 4 లక్షల స్క్వేర్ ఫీట్స్ అమ్మినట్లు చెప్పారు. అదికూడా 13 వేలకు తక్కువ కాకుండా, గ్రౌండ్, ఫస్ట్ ప్లోర్ అయితే 16 వేలకు తక్కువ అమ్మలేదట. సగం బ్లాక్ మనీ, సగం వైట్ మనీ అంటూ బేరాలు ఆడుతుండడం కూడా వీరి మోసానికి పరాకాష్ట. దీనిపై ఇన్వెస్టిగేషన్ అధికారులకు ‘స్వేచ్ఛ’ లేఖ రాయనున్నది. కస్టమర్లకు కాంప్లెక్స్‌లోని రూములు అంటగట్టేందుకు రకరకాల జిమ్మిక్కులు కూడా చేస్తున్నారు. రెంట్ ఇస్తాం, స్క్వేర్ ఫీట్‌కు ఇప్పుడు మీరు ఎంత పెడుతున్నారో దానికి డబుల్ అమ్ముడయ్యేలా చూస్తామంటూ గాలం వేస్తున్నారు.

ఆగని ప్రీ లాంచ్

టైటిల్‌పై కలెక్టర్ మను చౌదరి నుంచి తహసీల్దార్ వరకు ఎన్నో ప్రత్యుత్తరాలు కొనసాగాయి. ఆ పత్రాలు అన్నీ ‘స్వేచ్ఛ’ వద్ద ఉన్నాయి. అందుకే ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ ఫోటో వేసి వాళ్లపై వార్తలు రాశాం. సీలింగ్ భూములపై అధికార దుర్వినియోగం చేశారని ఆధారాలు ఉన్నాయి. మేడ్చల్ కలెక్టర్ ఇతర శాఖలకు డీ నోటిఫై రాసిన లేఖలు, 1970 నుంచి ఇప్పటి వరకు కోర్టులో ఉన్న కేసులు, అధికారులు లంచాలకు అలవాటు పడి చేసిన పనులు అన్నింటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. అలాంటి భూములపై ఎలాంటి అనుమతులు లేకుండా వందల కోట్లు సంపాదించి అనుమతులు తెచ్చుకోవాలని చూస్తున్నారు.

అందుకు ప్రీ లాంచ్‌లో అమ్మకాలు చేపట్టారు. ‘స్వేచ్ఛ’లో వచ్చిన కథనాలకు మోసపోయామని గ్రహించిన కొంత మంది కస్టమర్స్ స్టింగ్ ఆపరేషన్‌‌కి కూడా దొరికిపోయారు. బాచుపల్లిలో కమర్షియల్ అపార్ట్‌మెంట్ చూపించి కోట్లు వసూలు చేసి వికారాబాద్ జిల్లాలో లక్షల్లోని ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయడంపై కస్టమర్స్ మండిపడుతున్నారు. అందరిలా తాము మోసపోకుండా మరెవరినీ మైరాన్ హోమ్స్ ద్వారా మోసపోనివ్వకుండా కాపాడుకుంటామని చెబుతున్నారు.

Also Read: Real Estate Scam: టౌన్ ప్లానింగ్ నిబంధనలు తూచ్.. అక్కడ కోట్ల విలువైన భూములకు రక్షణేది?

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్