Thummala Nageswara Rao: దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో మేటిగా నిలిపేందుకు సమిష్టి చర్యలు అవసరమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ, నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ – 2025లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపు రైతుల సంక్షేమం, ఎగుమతులపై ఆయన దిశానిర్దేశం చేశారు.
రైతులకు గర్వకారణం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రి విజన్-2047లో వ్యవసాయాన్ని ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజన్‌గా చూస్తున్నామని మంత్రి తెలిపారు. పసుపు కేవలం వంటింటికే పరిమితం కాకుండా మెడిసిన్, న్యూట్రాస్యూటికల్స్ రంగాల్లో విస్తృతంగా వినియోగంలోకి వస్తోందన్నారు. ఆర్మూర్ పసుపుకు జీఐ ట్యాగ్ రావడం మన రైతులకు గర్వకారణమని పేర్కొన్నారు. నిజామాబాద్ రైతుల చిరకాల స్వప్నమైన నేషనల్ టర్మరిక్ బోర్డు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, రైతులకు సరైన పాలసీలు చూపే సంస్థగా పనిచేయాలని తుమ్మల సూచించారు.
Also Read: Thummala Nageswara Rao: యూరియా కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
విలువ ఆధారిత ఉత్పత్తులు
క్వింటా పసుపు సాగుకు రైతు రూ. 8-9 వేలు ఖర్చు చేస్తుంటే, మార్కెట్ ధర రూ. 12 వేల లోపే ఉండటం నిరుత్సాహపరుస్తోంది. బోర్డు జోక్యం చేసుకొని ధరల స్థిరత్వం, ముందస్తు మార్కెట్ సంకేతాలను రైతులకు అందించాలి’ అని కోరారు. రైతులు ముడి పసుపును మాత్రమే అమ్మకుండా, విలువ జోడింపుపై దృష్టి పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. పసుపు ప్రాసెసింగ్ సెంటర్లు, కర్క్యూమిన్ ఎక్స్‌ట్రాక్షన్ వంటి యూనిట్ల ద్వారా అధిక ఆదాయం లభిస్తుందన్నారు. అలాగే, ఆయిల్ పామ్ వంటి తోటల్లో పసుపును అంతర పంటగా సాగు చేయడం ద్వారా తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభం పొందవచ్చని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి నాణ్యమైన పసుపును ఎగుమతి చేయాలని కోరారు.
Also Read: Thummala Nageswara Rao: రబీకి సరిపడా యూరియా కోసం.. కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల లేఖ

