Honor Power 2: అదిరిపోయే ఫీచర్లతో Honor Power 2
phone ( Image Source: Twitter)
Technology News

Honor Power 2: భారీ బ్యాటరీతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న Honor Power 2 .. ఫీచర్లు ఇవే!

Honor Power 2: చైనాలో ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన Honor Power స్మార్ట్‌ఫోన్‌కు త్వరలోనే సక్సెసర్ రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన లీక్‌లు, రిపోర్ట్స్ ప్రకారం చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Honor, త్వరలోనే Honor Power 2ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్, పనితీరు పరంగా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Honor Power 2 స్పెసిఫికేషన్స్ లీక్

ప్రముఖ చైనా టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (Digital Chat Station) Honor Power 2కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను లీక్ చేశాడు. లీక్ ప్రకారం ఈ ఫోన్‌కు ‘సేబర్’ (Saber) అనే కోడ్ నేమ్ ఉన్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.79 ఇంచ్ 1.5K LTPS ఫ్లాట్ డిస్‌ప్లే ఉండనున్నట్లు తెలుస్తోంది. డిస్‌ప్లే పరంగా పెద్ద స్క్రీన్‌తో పాటు మెరుగైన విజువల్ అనుభూతిని అందించేలా డిజైన్ చేసినట్లు లీక్ సూచిస్తోంది.

ప్రాసెసర్, పనితీరు

Honor Power 2లో MediaTek Dimensity 8500 చిప్‌సెట్ ఉండనున్నట్లు సమాచారం. ఈ ప్రాసెసర్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మిడ్-టు-హై ఎండ్ సెగ్మెంట్‌లో ఈ చిప్‌సెట్ మంచి పనితీరును అందిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు
.
10,080mAh భారీ బ్యాటరీ 

Honor Power 2లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది దీని 10,080mAh భారీ బ్యాటరీ. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చాలా స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే అత్యంత పెద్ద బ్యాటరీలలో ఒకటిగా నిలవనుంది. అంతేకాదు, ఈ ఫోన్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్నట్లు లీక్ చెబుతోంది. దీని వల్ల భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది.

ఇది గతంలో లాంచ్ అయిన Honor Powerలో ఉన్న 8,000mAh బ్యాటరీతో పోలిస్తే పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఎక్కువ బ్యాటరీ బ్యాక్‌అప్ కోరుకునే యూజర్లకు ఇది పెద్ద ప్లస్ అవుతుంది.

కలర్ ఆప్షన్స్, లాంచ్ టైమ్‌లైన్

లీక్ సమాచారం ప్రకారం Honor Power 2 Snow White, Midnight Black, Sunrise Orange అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండనుంది. లాంచ్ విషయానికి వస్తే, ఈ ఫోన్‌ను చైనా స్ప్రింగ్ ఫెస్టివల్‌కు ముందే విడుదల చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు టిప్‌స్టర్ వెల్లడించాడు. దీని ప్రకారం Honor Power 2 2026 ప్రారంభంలో మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పెద్ద డిస్‌ప్లే వంటి ఫీచర్లతో Honor Power 2 బ్యాటరీ ఫోన్ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ లీక్ ఆధారిత వివరాలే కావడంతో, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్