David Reddy: ‘మిరాయ్’ తర్వాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) నటిస్తున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy). ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్‌పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి (Hanuma Reddy Yakkanti) ఈ చిత్రానికి దర్శకుడు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా ‘డేవిడ్ రెడ్డి’ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క (Maria Ryaboshapka) హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ ‘డేవిడ్ రెడ్డి’ సినిమా గ్లింప్స్ (David Reddy Glimpse)ను లాంఛ్ చేశారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. గ్లింప్స్‌ని గమనిస్తే..
Also Read- Purushaha: కన్నీళ్లతో చంపేస్తా.. పవన్ కళ్యాణ్ ‘పురుష:’ నుంచి హీరోయిన్ లుక్ విడుదల
టాలీవుడ్ ‘కెజియఫ్’
గత కొంతకాలంగా మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రీసెంట్‌గానే ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీలో మల్టీ హీరోల సినిమా చేసిన అనంతరం ‘మిరాయ్’లో విలన్‌గా కనిపించి, అందరినీ ఆకర్షించారు. ఇప్పుడు పూర్తి స్తాయి హీరోగా మళ్లీ తన స్టామినాను నిరూపించుకునేందుకు ఈ సినిమాతో రాబోతున్నారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఇది కదా మనోజ్ అంటే అని అనకుండా ఉండలేరు. ఓ పాప వాయిస్‌తో మొదలైన ఈ గ్లింప్స్.. ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా.. టాలీవుడ్ ‘కెజియఫ్’ని తలపిస్తోంది. సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి ఇంకొకరి గురించి చెప్పాలి అంటూ ఇచ్చిన ఎలివేషన్ అయితే మాములుగా లేదు. అతను బ్రిటీషర్స్‌కి శత్రువే. ఇండియన్స్‌కు శత్రువే. 25 కోట్ల మంది కోపం వాడొక్కడి రక్తంలో నిండింది.. అలా పవర్ ఫుల్ డైలాగ్స్ మధ్య మంచు మనోజ్ డేవిడ్ రెడ్డిగా ఎంట్రీ ఇచ్చారు. ‘మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటీషర్స్‌కి.. అతను వార్ డాగ్ అయ్యాడు’ అంటూ చెప్పే డైలాగ్‌తో ఈ సినిమా ఏ స్థాయిలో రూపుదిద్దుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. చివరిలో ‘యే బ్రిటీష్ ఇండియా నహీ హే.. యే డేవిడ్ రెడ్డి కా ఇండియా హే’ అంటూ మంచు మనోజ్ డేత్ నోట్ పట్టి చెప్పిన డైలాగ్.. నిజంగానే ‘కెజియఫ్’ని మించిన సినిమా టాలీవుడ్‌లో రాబోతుందనే ఫీల్‌ని ఇచ్చిందంటే.. ఇక మంచు మనోజ్‌ని ఆపటం ఎవరితరం కాదంతే. అలా ఉంది ఈ గ్లింప్స్.
Also Read- Venu Udugula: పద్మశ్రీ పొందిన ముఖం, ఖాళీ గోడలా కనిపిస్తోందా?.. వేణు ఊడుగుల పోస్ట్ వైరల్!
వార్ డాగ్, డెత్ నోట్
ఇక ఈ గ్లింప్స్ లాంఛ్ వేడుకలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘‘అభిమానుల అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నాకు ఇన్నేళ్లుగా ఇస్తున్న ప్రేమ, అభిమానానికి పాదాభివందనం. హీరోగా సినిమాలు చేయి అని నన్ను నిత్యం ప్రోత్సహిస్తున్నారు. నేను ఎలాంటి సినిమాతో మళ్లీ హీరోగా రావాలా అని అనుకుంటున్న టైమ్‌లో నా మిత్రుడు రామ్ ఫోన్ చేసి మంచి కథ ఉంది వినమని చెప్పాడు. అదే ‘డేవిడ్ రెడ్డి’ మూవీ. కథ విన్న వెంటనే బాగా నచ్చి ఓకే చెప్పేశాను. నన్ను ఎలాంటి మూవీలో చూపిస్తే బాగుంటుందో, అభిమానులు నన్ను ఎలాంటి మూవీలో చూడాలని అనుకుంటున్నారో అలాంటి స్టోరీని దర్శకుడు హనుమ రెడీ చేశారు. 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. ఎక్కడా రాజీ పడకుండా కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్ పెట్టి వెంకట్ రెడ్డి, భరత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్లు డైరెక్టర్ హనుమ మీద పూర్తి నమ్మకంతో ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. డేవిడ్ రెడ్డి బ్రిటీష్ వారికే కాదు ఇండియన్స్ కూడా శత్రువే. డేవిడ్ రెడ్డికి పీస్ ఫుల్‌గా ఉండటం రాదు, ఏదైనా వెళ్లి కొట్టి తెచ్చుకోవడమే తెలుసు. ఇలాంటి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి నాతో ఈ మూవీ చేస్తున్న డైరెక్టర్ హనుమకు థ్యాంక్స్. అద్భుతమైన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేస్తున్నారు. డేవిడ్ రెడ్డి బైక్ పేరు వార్ డాగ్, అతని చేతులో ఉన్న స్టిక్ పేరు డెత్ నోట్. ఇవి రెండే డేవిడ్ రెడ్డి ఆయుధాలు. ఇండియాకు స్వాతంత్ర్యం అడిగి కాదు.. కొట్టి తెచ్చుకోవాలనేది డేవిడ్ రెడ్డి దృక్పథం. బ్రిటీష్ వాళ్లు ఊళ్లకు ఊళ్లు తగలబెడుతుంటే ఆ హింసను హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా ఇందులో డేవిడ్ రెడ్డి కనిపిస్తాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్, శింబు గెస్ట్‌లుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కథలో గెస్ట్ రోల్స్‌కు స్కోప్ ఉంది కానీ, ఇప్పటివరకు ఏ హీరోను అప్రోచ్ కాలేదు. అంతా ఓకే అయిన తర్వాత డీటెయిల్స్ చెబుతాం. నేను సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్ చేసినప్పుడు సపోర్ట్‌గా ఉండి నెత్తిమీద పెట్టుకున్నారు అభిమానులు. వాళ్లకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉంది. చరిత్రలో ఎవరికీ తెలియని కొన్ని సంఘటనలు, దారుణాలను ఎదుర్కొనేందుకు ఒక వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుంది? అనేది ‘డేవిడ్ రెడ్డి’ మూవీలో చూస్తారు’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

