Jinn Movie: ‘జిన్’ అలా ఇలా భయపెట్టడు.. థియేటర్లలో ఒక్కొక్కరికి!
Nikhil M Gowda on Jinn (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Jinn Movie: ‘జిన్’ అలా ఇలా భయపెట్టడు.. థియేటర్లలో ఒక్కొక్కరికి! నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

Jinn Movie: సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల పై నిఖిల్ ఎం. గౌడ (Nikhil M Gowda) నిర్మించిన చిత్రం ‘జిన్’ (Jinn). ఈ మూవీలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు చిన్మయ్ రామ్ (Chinmay Ram) దర్శకుడు. డిసెంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ఈ సినిమా సిద్దమైంది. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట్టుకుని సినిమాపై మంచి హైప్‌ని పెంచాయి. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర నిర్మాత నిర్మాత నిఖిల్ ఎం గౌడ (Nikhil M Gowda Interview) మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Purushaha: కన్నీళ్లతో చంపేస్తా.. పవన్ కళ్యాణ్ ‘పురుష:’ నుంచి హీరోయిన్ లుక్ విడుదల

నటించాలని వచ్చి నిర్మాతనయ్యా..

‘‘మాది బెంగళూరు. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. అప్పటి నుంచి ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తుండేవాడిని. ఆ ఇంట్రెస్ట్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. నటించాలనే కోరికతో వచ్చి.. నిర్మాతగా మారాను. నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ద్వారా చిత్ర దర్శకుడు చిన్మయ్ రామ్ పరిచయమయ్యారు. నాకు సినిమాల మీదున్న ప్యాషన్, ఇష్టం తెలుసుకుని చిన్మయ్ రామ్ ఈ ‘జిన్’ కథ చెప్పారు. ఆయన చెప్పిన కథ నాకు ఎంతగానో నచ్చింది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా అని.. నేనే నిర్మించేందుకు ముందుకు వచ్చాను. ఈ చిత్రాన్ని కర్ణాటక, ఆంధ్రా బార్డర్‌లో షూట్ చేశాం. డిఫరెంట్ కంటెంట్, న్యూ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ‘జిన్’ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆల్రెడీ సినిమాను నేను చూశాను. కథ విన్నప్పుడు ఏదయితే ఫీల్ అయ్యానో, ఊహించుకున్నానో.. తెరపై చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. కచ్చితంగా అందరినీ భయపెట్టేలా ఈ చిత్రం ఉంటుంది.

Also Read- YouTube Reporter Arrest: యూ ట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని వసూళ్లు చేస్తున్న​ రిపోర్టర్‌ అరెస్ట్..!

కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు

ఈ సినిమాకు అలెక్స్ ఇచ్చిన ఆర్ఆర్, సునీల్ హొన్నలి విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్‌. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా చిన్మయ్ రామ్ ఈ మూవీని తెరపైకి తీసుకు వచ్చారు. మా టీం సహకారం వల్లే ఈ మూవీ ఇంత అద్భుతంగా వచ్చిందని చెప్పగలను. ఇందులో నటించిన వారంతా అద్భుతంగా నటించారు. షూటింగ్ టైమ్‌లో కూడా వారంతా ఎంతగానో సహకరించారు. ‘జిన్’ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మేం చేసిన ఈ కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరించి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఈ జిన్ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. మేం ఈ మూవీలో కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. ఈ సినిమా తర్వాత కొన్ని కథలను విన్నాను. ప్రస్తుతం చర్చల దశల్లోనే ఉన్నాయి. ఇకపై కన్నడ, తెలుగు భాషల్లో కంటిన్యూగా సినిమాలను చేయాలని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా?.. మంచు మనోజ్ చెప్పేది వింటే ఏమైపోతారో?

Jinn Movie: ‘జిన్’ అలా ఇలా భయపెట్టడు.. థియేటర్లలో ఒక్కొక్కరికి! నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

Purushaha: కన్నీళ్లతో చంపేస్తా.. పవన్ కళ్యాణ్ ‘పురుష:’ నుంచి హీరోయిన్ లుక్ విడుదల

Shocking Crime: అమెరికాలో తండ్రిని చంపిన భారత సంతతి యువకుడు.. ఇదే అసలైన ట్విస్ట్!

Harish Rao: రేవంత్ పాలనలో పల్లెలకు అవార్డులు అభివృద్ధి బంద్!: హరీష్ రావు