Tamil Nadu Crime: తమిళనాడులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచనం రేపుతుంది. భర్త ముందే తన భార్య పై కొంతమంది దుండగులు హత్యాచారానికి పాల్పడిన ఈ దారుణ ఘటన యాంవత్ సమాజాన్నే తలదించుకునేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.
భార్య భర్తలు కలిసి..
తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలోని తూత్తుకూడి(Thoothukudi) జిల్లా పరిధిలోని గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులు విరిద్దరు కలిసి ఇటుకల బట్టిలో పనిచేస్తున్నారు. అయితే పనిముగించుకొని, వారిద్దరు భార్య భర్తలు కలిసి ఇంటికి వెల్లుతున్న సమయంలో కొందరు యువకులు వారిని గమనించి వారిద్దరిని దారికి అడ్డుగా వచ్చి నిలబడ్డారు. అనంతరం భర్తను దూరంగా తోసివేసి, భార్యపై అత్యాచారం చేయభోయారు. దీంతో భర్త, మహిళను కాపాడటానికి ప్రయత్నిస్తుండగా దుండగులు అతనిపై విచక్షణ రహితంగా దాడిచేసి, అతడిని అటవి ప్రాంతానికి లాక్కెల్లారు. అనంతరం తన భార్యపై అత్యాచారం చేశారని భర్త తెలియచెప్పాడు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఈ సంఘటన అనంతరం భాదిత దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్(Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఎర్పాటు చేసి నిందితులను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘటన ప్రదేశ సమీపంలోని కొంతమందిని పోలీసులు పట్టుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Also Read: IDPL Land Issue: రవీందర్ రావు బాగోతాన్ని మొత్తం బయటపెడతా: శ్రీకాంత్ గౌడ్

