Sarpanches: తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ (Panchayat Raj Department) కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సర్పంచ్ ల అపాయింట్ డే ఈనెల 20 నుంచి 22 తేదీకి వాయిదా వేసింది. డిసెంబర్ 20వ తేదీన సరైన ముహూర్తాలు లేకపోవడంతో ఈ నెల 22కు వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి చేశారు. వారి సూచనలను పరిగణలోకి తీసుకున్న పంచాయతీ రాజ్ శాఖ.. అపాయింట్ డే తేదీని వాయిదా వేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన నూతన సర్పంచ్ లు.. డిసెంబర్ 22వ తేదీన ఒకేసారి బాధ్యతలు చేపట్టనున్నారు.
పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో డిసెంబర్ 22న గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేయనున్నాయి. సర్పంచ్ గా గెలిచిన వ్యక్తి.. ప్రమాణ పత్రంపై సంతకం చేసి ఆ రోజున అధికారికంగా బాధ్యతలు చేపబడతారు. అటు వార్డు సభ్యులు సైతం అదే రోజున తమ బాధ్యతలను స్వీకరిస్తారు. డిసెంబర్ 22 నుంచి సదరు గ్రామం.. కొత్త సర్పంచ్ పాలనలోకి అడుగుపెడుతుంది.
Also Read: Minister Nara Lokesh: శ్రీచరణికి రూ.2.5 కోట్ల బహుమతి.. చెక్ అందజేసిన మంత్రి నారా లోకేశ్
కాగా నేటితో (బుధవారం)తో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకు మూడో విడత పోలింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఓటు వేసేందుకు అనుమతించారు. మూడో విడతలో 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తమ గ్రామం, వార్డును అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉన్న అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేశారు.

